Actress Jamuna Passed Away సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. తమిళ, తెలుగు భాషల్లో నటించిన ఆమె ఎక్కువగా మనకు సత్యభామగా గుర్తుండిపోయారు. ఆరోగ్య సమస్యలతోనే జమున నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. గతేడాది సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు వంటి సినీ దిగ్గజాలు మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా జమున అస్తమయంతో టాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1936 ఆగస్టు 30న కర్ణాటక హంపిలో ఆమె జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో తెరంగ్రేటం చేశారు. బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, కీలుబొమ్మలు, లేత మనసులు, మూగమనసులు, చదరంగం, శ్రీకృష్ణతులాభారం లాంటి 150కు పైగా సినిమాలో నటించి తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు. నేటి ఉదయం 11 గంటలకు ఫిల్మ్ చాంబర్‌కి జమున భౌతిక కాయం సందర్శనార్థం తీసుకురానున్నారు.


ఇక ఆమె రాజకీయంగానూ ఎంట్రీ ఇచ్చారు. 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన జమున.. ఆ తరువాత మళ్లీ 1991 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక నాటి తరం తారలంతా ఇలా నేల రాలుతుండటంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.


పదహారేళ్ల వయసులోనే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చారు. మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి చిత్రాలెన్నో కెరీర్‌లో నిలిచేపోయేలా ఉంటాయి. ఇక ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సైతం వచ్చాయి. ఆమె తన కెరీర్‌లో మొత్తంగా దాదాపు రెండువందల చిత్రాలు చేసి ఉంటారు. అందులో ఎక్కువగా మన ఏఎన్నార, ఎన్టీఆర్‌లతోనే చేసి ఉంటారు. సావిత్రి, జమున, ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి చేసిన చిత్రాలెన్నో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.


1968లో ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. 1972లో పండంటి కాపురం సినిమాకు గానూ మరోసారి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. ఇలా ఆమె కెరీర్‌లో సామాజిక, జానపద చిత్రాలెన్నింట్లోనూ నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పటికే మనకు సత్యభామ అంటే జమున మాత్రమే గుర్తుకు వస్తుంటారంటే అది ఆమె ప్రతిభ.


Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి