పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ క్రేజ్ ఉత్తరాదిన అంతకంతకూ పెరుగుతోంది. పుష్ప సినిమా సృష్టించిన సంచలన విజయం అల్లు అర్జున్‌కు బాలీవుడ్ సినిమా ఆఫర్ తెచ్చిపెట్టింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడితో నెక్స్ట్ సినిమా నిర్ధారణైందని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం ప్రపంచంలో పుష్ప సినిమా సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. మొన్నటివరకూ ఎక్కడ చూసినా శ్రీవల్లి పాట స్టెప్పులే కన్పించాయి. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ తగ్గేదే లే మేనరిజమే వ్యాపించింది. అందుకే దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. అనుకున్న సమయం కంటే ఆలస్యమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభమైంది. అభిమానులు మాత్రం ఎప్పుుడా అని ఎదురుచూస్తున్నారు.


ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు బాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చినట్టుగా సమాచారం. అది కూడా బాలీవుడ్‌లో క్రియేటివ్ నిర్మాత, దర్శకుడైనా దినేష్ విజన్‌తో బన్ని ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఇవాళ పరోక్షంగా స్పష్టం చేశారు. తోడేలు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా.. బన్నీ-దినేష్ కాంబినేషన్ సినిమా రావాలని కోరుకుంటున్నట్టు అల్లు అరవింద్ తెలిపారు. వాస్తవానికి పుష్ప సినిమాకు ముందే..దినేష్ విజన్ ఓ స్క్రిప్ట్‌తో బన్నీ దగ్గరకు వెళ్లడం, బన్నీ ఒప్పుకోవడం జరిగినట్టు సమాచారం. అల్లు అర్జున్ పాన్ ఇండియా నటుడిగా ఎదుగుతాడని ముందుగా గుర్తించించి నిర్మాత దినేష్ విజనేనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. 


ఇవాళ ప్రీ రిలీడ్ వేడుక జరుపుకున్న తోడేలు సినిమాకు నిర్మాత దినేష్ విజన్ కావడం గమనార్హం. పుష్ప సినిమా కంటే ముందే అల్లు అర్జున్‌కు ఉత్తరాదిన విశేషమైన క్రేజ్ ఉంది.


Also read: Rashmi Gautam: మల్దీవుల ట్రిప్‌కు వెళ్లిన యాంకర్ రష్మీ.. లేటెస్ట్ పిక్స్ చూసేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook