Anushka Malayalam Movie: తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్క(Anushka Shetty).. ఇప్పుడు తొలిసారి మాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. 'కథనార్-ది వైల్డ్ సోర్సెరర్'(kathanar: the wild Sorcerer) అనే హార్రర్ మూవీ ద్వారా మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనుష్క. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మలయాళ స్టార్ హీరో జయసూర్య లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనుష్క అరుందతి తరహా పాత్ర చేయబోతుందని సమాచారం. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుందని తెలుస్తోంది. మెుదటి పార్ట్ 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని మెుత్తంగా 14 భాషల్లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.  



ప్రస్తుతం అనుష్క తెలుగులో యంగ్‌ హీరో న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty)తో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'(Miss Shetty Mr Polishetty) అనే సినిమాలో నటించింది. మహేశ్ బాబు పీ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబరు 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, పోస్టర్లు మరియు సాంగ్స్ సినిమాపై వీరలెవల్లో అంచనాలను పెంచేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతుంది. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.


Also Read: Kushi Movie OTT: ఓటీటీలోకి ఖుషి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి