Bhadrachalam Temple-Prabhas: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ భద్రాచలం సీతారాముల ఆలయానికి రూ.10 లక్షల విరాళం అందించారు. ఆయన ప్రతినిధులు దంతులూరి సత్యనారాయణరాజు, వేమారెడ్డి, విక్రమ్‌, శ్రీనివాసరెడ్డి శనివారం ఆలయానికి వచ్చి ఈవో రమాదేవికి చెక్కును అందించారు. ప్రభాస్ అందించిన ఈ విరాళాన్ని అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల నిమిత్తం కేటాయించినట్లు ఏఈవో భవాని రామకృష్ణారావు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డార్లింగ్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ ను 70 దేశాల్లో విడుదల చేశారు మేకర్స్. దీనికి ఆడియన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. ఇందులో సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటించిన సంగతి తెలిసిందే. తాజా ట్రైలర్ లో సీత గీత దాటడం, లంకా దహణం, రావణ సంహారం, శబరి ఎపిసోడ్, రామసేతు నిర్మాణం లాంటి కీలకమైన సన్నివేశాలను చూపించారు. అయితే ఈ మూవీ విజయవంతం కావాలని ప్రతినిదులు భద్రాచల ప్రధానాలయంలో మూలవిరాట్‌కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీతాయారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


ఇతర చిత్రాల విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' మూవీని చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ కనిపించనుంది. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇది కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. మరోవైపు నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు కె' అనే చిత్రంలో నటిస్తున్నాడు డార్లింగ్. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క జరుగుతుంది. ఇంకో వైపు ప్రభాస్ 'స్పిరిట్' అనే సినిమా కూడా ఓకే చెప్పాడు. 


Also Read: Ram Charan Fans: ఉపాసనపై దారుణ వ్యాఖ్యలు.. సునిశిత్ ను చావచితక్కొట్టిన రామ్ చరణ్ ఫాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook