Sequel Movies: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన మేటి చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలకు ఇప్పటికీ క్రేజ్ ఉంది. నాటి మేటి చిత్రాల్లో అటువంటి కొన్ని చిత్రాలిప్పుడు సీక్వెల్‌కు సిద్ధమవుతున్నాయి. అవేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్‌లో(Tollywood) కొన్ని హిట్ చిత్రాలకు ఎవర్‌గ్రీన్ క్రేజ్ ఉంటుంది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రాలు ఎంతటి సెన్సేషన్, ఎంతటి హిట్ సాధించాయో చెప్పనక్కరలేదు. కనకవర్షమే కురిపించాయి. అటువంటి సినిమాలు చాలానే ఉన్నా..కొన్ని చిత్రాల టైటిల్స్ వింటే ఇప్పటికే మరోసారి చూడాలనే ఆసక్తి వస్తుంది. అటువంటి కొన్ని సినిమాలు ఇప్పుడు సీక్వెల్‌కు సిద్ధమవుతున్నాయి.


ముఖ్యంగా హర్రర్ ఎలిమెంట్‌తో హిట్ సాధించిన చంద్రముఖి సీక్వెల్‌కు(Chandramukhi Sequel) సన్నాహాలు జరుగుతున్నాయి. స్టార్‌క్యాస్ట్ ఖరారవుతోంది లారెన్స్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక 25 ఏళ్ల క్రితం సంచలన హిట్ నమోదు చేసిన దక్షిణాది మేటి చిత్రం ప్రేమదేశం. క్లాసికల్ లవ్‌స్టోరీ ప్రధానంగా సాగిన చిత్రమిది. ఈ చిత్రం మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు కదీర్..రెండవ భాగాన్ని కూడా సిద్ధం చేస్తున్నాడు. ఈసారి పూర్తిగా కొత్త నటీనటులతో సీక్వెల్ ఉండనుంది. ఇక రాజమౌళి తీసిన ఈగ ఎంతలా హిట్ సాధించిందో అందరికీ తెలుసు. అన్ని భాషల్లోనూ హిట్ కొట్టిన సినిమా ఇది. బాహుబలి సీక్వెల్ తీసిన రాజమౌళి(Rajamouli)..ఈగకు సీక్వెల్ తీయాలనుకున్నాడు. కానీ ఈ ప్రతిపాదన కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. ప్రస్తుతానికి మరో సినిమా విక్రమార్కుడు సీక్వెల్ స్టోరీ సిద్ధమైంది. విక్రమార్కుడు తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో రీమేక్‌లో కూడా భారీ విజయం నమోదు చేసుకుంది. 


Also read: Bigg Boss Anchor Ravi issue : యాంకర్‌‌ రవి, లహరి మిడ్‌నైట్‌ హగ్‌ ఇష్యూపై నిత్య పోస్ట్, కెప్టెన్సీ కోసం సీక్రెట్ టాస్క్, ప్రియను ఎలిమినేట్ చేయాలని డిసైడ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి