Director Sudheer Varma Upset with Saakini Daakini Producers: రెజీనా కసాండ్రా, నివేదా థామస్ హీరోయిన్లుగా శాకినీ డాకినీ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి, దీంతో ఈ సినిమా పూర్తిస్థాయిలో విడుదలకు సిద్ధమైంది. సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' కు అధికారిక తెలుగు రీమేక్ అయినా ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడిగా వ్యవహరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరించారు.  'శాకిని డాకిని' సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రమోషన్స్ లో నిర్మాతతో పాటు హీరోయిన్లు  కనిపించారు కానీ దర్శకుడు కనిపించలేదు. అయితే దర్శకుడు ఈ సినిమా విషయంలో అసంతృప్తితో ఉన్నాడని తాను రాసుకున్న స్క్రిప్ట్ కాకుండా నిర్మాతలు తాము అనుకున్న స్క్రిప్ట్ దర్శకుడు చేత దర్శకత్వం చేయించారని, ఆయన చేయనని అంటే మరొక దర్శకుడు ఆనంద్ రంగాతో సినిమాకు సంబందించిన కొన్ని సీన్స్ కూడా మార్చారని తెలుస్తోంది.


అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ లో సుధీర్ వర్మ కనిపించకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద ఇప్పుడు నిర్మాతలలో ఒకరైన సునీత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేమీ లేదని సుధీర్ వర్మ ఈ సినిమా జనవరి 2020 లో మొదలుపెట్టారని, మధ్యలో కోవిడ్ వాళ్ళ వల్ల వచ్చింది కదా, ఇప్పుడు ఆయన ఉన్న స్టేజ్ లో సినిమా అయిపోయిన తర్వాత కూడా ప్రతి దానికి మీరు రండని అడగడం కూడా సరికాదని పేర్కొన్న ఆమె ఆయన ఇప్పుడు పెద్ద సినిమా చేస్తున్నారు.


మనం ఆయన్ని సపోర్ట్ చేయాలని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం ఆయన చాలా కమిట్మెంట్ తో పని చేశారని, ఆయన సూచించిన వ్యక్తితోనే కొన్ని ప్యాచ్ వర్క్స్ చేశామని చెప్పుకొచ్చారు.  అయితే ఈ క్లారిటీ అసలు ఏమాత్రం అర్ధవంతంగా లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. సుధీర్ వర్మ స్క్రిప్ట్ లో నిర్మాతలు వేలు పెట్టడం, మరో దర్శకుడిని ఎంటర్ చేయడం వల్లే ఆయన అలిగి ప్రమోషన్స్ రాలేదనే జరుగుతున్న ప్రచారానికి నిర్మాతలు ఇచ్చిన క్లారిటీ మరింత ఊతం ఇచ్చినట్టు ఉంది. రి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులు తేల్చనున్నారు. 
Also Read: Shanmukh Jaswanth Hospitalised: ఆసుపత్రి పాలయిన షణ్ముఖ్ జస్వంత్ .. ఆందోళనలో ఫాన్స్!


Also Read: Kavitha Invested Money on Liger: లైగర్ నిర్మాణం వెనుక కవిత.. ఆ డబ్బుతోనే నిర్మాణం.. జనగణమన కూడా లైన్లో... ఈడీకి సంచలన ఫిర్యాదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి