కరోనా వైరస్ మహమ్మారి తెలుగు చిత్రసీమలో మరో విషాదాన్ని నింపింది. ఇదివరకే గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంను మన నుంచి దూరం చేసిన కరోనా మహమ్మారి పలువురు దర్శకులు, నిర్మాతలను సైతం కబలించింది. తాజాగా యువ కథా రయియిత కరోనాతో కన్నుమూశాడు. టాలీవుడ్‌ సినీ కథా రచయిత వంశీ రాజేష్ కరోనా వైరస్ సోకడంతో (Writer Vamsi Rajesh dies due to CoronaVirus) మృతి చెందాడు. ఇటీవల టెస్టులు చేయించుకోగా వంశీ రాజేష్‌కు కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు.



 


గత కొంతకాలంగా కరోనాకు చికిత్స తీసుకుంటున్నాడు. అయితే పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో  ఆరోగ్యం విషమించడంతో వంశీరాజేష్ గురువారం తుది శ్వాస విడిచాడు. చిన్న వయసులోనే వంశీ రాజేష్ ఆకస్మిక మరణం టాలీవుడ్‌ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ రచయిత వంశీ రాజేష్ మృతిపట్ల  పలువురు  సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.



 


టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్లతో వంశీ రాజేష్ కలిసి పనిచేశారు. రవితేజ హీరోగా తెరకెక్కిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాకు రచయితగా సేవలందించారు. ఇటీవల హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడటం తెలిసిందే. జీవిత, వీరి కుమార్తెలు కోలుకున్నా రాజశేఖర్ క్రిటికల్ కండీషన్‌‌కు వెళ్లిపోయారు. సిటీ న్యూరో హాస్పిటల్ వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకలేదు కానీ పాజిటివ్ అని వచ్చినట్లు రిపోర్టులు రావడంతో ఆయన ఫ్యాన్స్‌కు అసలు విషయాన్ని తెలిపారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook