Naveen Polishetty: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్ పొలిశెట్టి.. జాతిరత్నాలు ఫెమ్ కు ఏంజరిగిందంటే..?
Naveen Polishetty: జాతిరత్నాలు ఫెమ్ నవీన్ పొలిషెట్టీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన అమెరికాలో లో షూటింగ్ కోసం వెళ్లారు. ఈ క్రమంలో బైక్ మీదనుంచి పడగా తీవ్రగాయలయ్యాయి.
Jathi Ratnalu Fame Naveen Polishetty Met With Road Accident In USA: టాలీవుడ్ యంగ్ హీరోనవీన్ పొలిశెట్టికి రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. అమెరికాలో షూటింగ్ కోసం నవీన్ పొలిశెట్టి వెళ్లారు. ఆ సమయంలో బైక్ మీద స్కిడ్ అయి పడటంతో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడున్న సినిమా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అమెరికాలోని వైద్యులు నవీన్ పొలిశెట్టికి అనేక టెస్టులు,స్కానింగ్ లు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు చేతికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తొంది. దీంతో వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి నవీన్ పొలిశెట్టికి ట్రీట్మెంట్ అందించారు.
Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?
చేతి వేళ్లలోని ఎముకలు అనేక చోట్ల చిట్లినట్లు తెలుస్తోంది. రెండు నెలలపాటు కూడా ఎలాంటి షూటింగ్ లకు వెళ్లకూడదని, పూర్తిగా రెస్ట్ తీసుకొవాలని కూడా సూచించినట్లు సమాచారం. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సితారా బ్యానర్, షైన్ బ్యానర్ లో సినిమాషూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.
Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..
నవీన్ పొలిశెట్టి రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయంవెలుగులోకి రావడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు, ఫ్రెండ్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవీన్ కు ఫోన్ లు చేసి ఆయన ఆరోగ్యంపై ఆరాతీస్తున్నారు. నవీన్ పొలిశెట్టి టీమ్ కు చాలా మంది ఫోన్ కాల్స్ చేసి మరీ, హెల్త్ గురించి ఆరాతీస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook