D50 Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తాడు. తమిళంతోపాటు తెలుగు, హిందీ, హాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల తెలుగులో సార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ మూవీతో టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు ధనుష్. ఆయన ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ అనే సినిమా చేస్తున్నాడు. ధనుష్ వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.  ప్రస్తుతం ఇతడు కెప్టెన్ మిల్లర్ తోపాటు హిందీలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ధనుష్ 50వ చిత్రం పట్టాలెక్కనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ధనుష్ తన 50వ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ గా #D50 అని పెట్టారు. గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని  ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో నటించనున్నాడు. ఈ మూవీలో సందీప్ కిషన్ నటించబోతున్నాడని చిత్రయూనిట్ రీసెంట్ గా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో హీరో విష్ణు విశాల్, ఎస్ జే సూర్య కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ధనుష్ కి సోదరుడిగా సందీప్ నటించబోతున్నడట. ఇందులో పెద్దవాడిగా ఎస్జె సూర్య నటించనున్నాడు. ఈ మూవీ తర్వాత ధనుష్  తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ములా దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది.


Also Read: Shah Rukh Khan: రికార్డు ధరకు షారుఖ్ 'జవాన్' నాన్ థియేట్రికల్ రైట్స్.. బాలీవుడ్ చరిత్రలో ఇదే అత్యధికం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook