Tollywood Disaster Movies 2023: ఈ సంవత్సరం అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే.. మరీ ఇంత దారుణంగా..!
Disaster movies 2023 : 2023 లో ఎన్నో తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ లు కూడా అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి కూడా కనీసం కలెక్షన్లు కూడా అందుకోలేక ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సినిమాలు ఏంటో చూసేద్దామా..
Flop Movies 2023: ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎన్నో సినిమాలు భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ వద్ద విడుదల అయ్యాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని సాధించాయి. విడుదల కి ముందు వరకు బాగా క్రేజ్ ఉంది కూడా విడుదల తర్వాత మాత్రం డిజాస్టర్ గా నిలిచిన కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.
శాకుంతలం: స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో మైథలజికల్ ఎపిక్ సినిమాగా మంచి అంచనాల మధ్య విడుదలైన శాకుంతలం సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. కనీసం విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగో లేకపోవడంతో సినిమా కలెక్షన్ల పరంగా కూడా డిజాస్టర్ అయింది.
భోళా శంకర్: మెహర్ రమేష్ వంటి ఫ్లాప్ డైరెక్టర్ సినిమా అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ కారణంగా అయినా సినిమా హిట్ అవుతుంది అని అభిమానులు అనుకున్నారు. కానీ అవుట్ డేటెడ్ కామెడీ కారణంగా సినిమా కొద్ది రోజులు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిలవలేకపోయింది. ఇక అసలు ఇలాంటి సినిమానే లేదు అని అభిమానులు సైతం మర్చిపోయాలాగా ఈ సినిమా డిజాస్టర్ అయింది.
ఏజెంట్: ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంటర్ అయినప్పటి నుంచి ఒక్క మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ తన ఆశలన్నీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ఏజెంట్ సినిమా పైన పెట్టుకున్నాడు. సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు కానీ కనీసం బౌండ్ స్క్రిప్ట్ కూడా లేని ఈ కథ బాక్స్ ఆఫీస్ వద్ద బెడిసి కొట్టింది. అఖిల్ కరియర్ లో మరొక డిజాస్టర్ గా నిలిచింది.
స్పై: నిఖిల్ సినిమా అంటేనే కొత్తగా ఉంటుంది అని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అలాంటి కొత్తదనం స్పై సినిమాలో కనిపించలేదు. సుభాష్ చంద్రబోస్ గురించి కథ అనడంతో అందరూ ఎక్సయిట్ అయ్యారు కానీ సినిమాలోని ఫ్లాట్ స్క్రీన్ ప్లే, రొటీన్ ట్విస్ట్ ల కారణంగా సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
స్కంద: బోయపాటి సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. పైగా రామ్ పోతినేని హీరో కాబట్టి యాక్షన్ ఎంటర్టైనర్ అయినప్పటికీ యావరేజ్ గా అయినా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ అదే రొటీన్ టెంప్లేట్ లో ఏమాత్రం లాజిక్ లేకుండా బోయపాటి తీసిన ఈ సినిమా అతిపెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.
కాగా ఆదికేశవ, గాంధీవదారి అర్జున్ లాంటి సినిమాల గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకు ముఖ్య కారణం ఈ చిత్రాలు షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఇవి ఫ్లాప్ సినిమాలే అని ప్రేక్షకులే కాకుండా సినీ ఇండస్ట్రీ వారు కూడా ఫిక్స్ అయిపోయారు. అందుకే ఈ సినిమాలకు పెద్దగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరగలేదు.
Also Read: Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి