Actress Sandhya Raju: ప్రముఖ కూచిపూడి డాన్సర్ అయిన సంధ్యా రాజు ఒక మంచి నటి కూడా. ఆమె చేసిన ఎన్నో పర్ఫామెన్స్ లు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. ఆమె ప్రతిభకు మెచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది మురము స్వయంగా ఆమెకు ఆహ్వానం పంపారు. త్వరలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా.. ఎట్ హోం సెలబ్రేషన్లు జరగబోతున్నాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో ఈ వేడుకలు నిర్వహించబడతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వేడుకల్లో పాల్గొనమంటూ సంధ్యా రాజుకి ఆహ్వానం లభించింది. సంధ్యా రాజు నటిగా మారిన మొదటి సినిమా నాట్యం. ఆ సినిమాతోనే ఆమె రెండు జాతీయ పురస్కారాలు అందుకుంది. తమిళనాడు ప్రముఖ వ్యాపారవేత్త.. రామ్ కో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన పి ఆర్ వెంకటరామ రాజా కూతురే సంధ్యారాజు. 


హైదరాబాదులో నిశృంఖ‌ల డ్యాన్స్ అకాడెమీ, నిశృంఖ‌ల ఫిల్మ్ ఫౌండర్ గా సంధ్యా రాజు చాలామందికి తెలుసు. తన కళతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఏర్పరచుకుంది సంధ్యారాజు. అటు క్లాసికల్ డాన్స్ లోనూ ఇటు నటనలోనూ తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళుతున్నారు. కొరియోగ్రాఫర్ గా, నిర్మాతగా పనులు చేస్తూ కూడా సాంస్కృతిక రంగంలో ఆమె ఎందరికో స్ఫూర్తిని ఇస్తున్నారు. 


ఇక ఎట్ హోమ్ వేడుకలు ఆగస్టు 15 సాయంత్రం ఢిల్లీ రాష్ట్రపతి భవనంలో జరగనున్నాయి. ఉదయం జెండా వందనం పూర్తయిన తర్వాత సాయంత్రం ఈ ఎట్ హోమ్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలాగా అందరూ ట్రెడిషనల్ వస్త్రాలతో కనిపిస్తారు. 


సీనియర్ రాజకీయ నాయకులు, మిలిటరీ అధికారులు, ఇతర ఇతర రంగాల్లో ముఖ్యమైన వ్యక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకుంటారు. ఇందులో భాగంగానే సంధ్య రాజు కూడా పాల్గొనబోతున్నారు.


Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter