Tritiya Jewellery Kanthi Dutt arrested: సమంత, కీర్తీ సురేష్ లో పాటు.. అనక మందిని డబ్బులు వస్తాయని ఆశచూపించి..తృతీయ జువెల్లర్స్ అధినేత కాంతిదత్ మాయ మాటలు చెప్పినట్లు తెలుస్తొంది. ఇతగాడి మాటలు నమ్మి.. కాంతిదత్ సస్టైన్ కార్ట్ అనే బిజినెస్ సంస్థను ప్రారంభించారు. దానిలో సెలబ్రీటీల చేత భారీగా పెట్టుబడులు పెట్టించాడు. కానీ వీరు అనుకున్నంత లాభాలు రాలేదు. ఆ తర్వాత ఎన్నిసార్లు దీనిపై మాట్లాడేందుకు ప్రయత్నించిన.. అతగాడు మోహం చాటేసినట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో చాలా మంది సెలబ్రీటీలు ఇతగాడి మాయలో పడిపోయినట్లు తెలుస్తొంది. నటుడు సామ్రాట్ రెడ్డి సోదరి, సామ్ కు సన్నిహితంగా ఉండే.. శిల్పారెడ్డి కూడా ఇందులో పెట్టుబడులు పెట్టిందంట. కానీ కొద్దిరోజులకే మోసపోయినట్లు గ్రహించి..  పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువతి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కాంతిదత్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తొంది.


కాగా, ఇతగాడు.. కీర్తి సురేష్, సమంత, పరిణితీ చోప్రాతోపాటు.. శిల్పారెడ్డి వంటి వారిని కూడా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు.. ఇతగాడు.. 100 కోట్లకు పైగా లూటీ చేసినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు మాత్రం ఇతడి ఫోన్ లను, లాప్ టాప్ లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారంట. దీంతో ఈ వార్త మాత్రం.. బాధలో ఉన్న సమంతకు.. గుడ్ న్యూస్ అని చెప్తున్నారు.


Read more: Priyanka jain: శ్రీ వారికి పరమ భక్తులం.. ప్రాంక్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్, శివ.. ఏమన్నారంటే..?


మరోవైపు.. ఈ ఘటనమాత్రం.. ప్రస్తుతం తండ్రి చనిపోయిన  బాధలో ఉన్న సామ్ కు తీపికబురు లాంటిదని ఆమె అభిమానులు అంటున్నారంట. మరోవైపు.. కీర్తీ సురేష్ కూడా తనపెళ్లికి రెడీ అయిపోతున్న విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు.. ఆంటోనీని పెళ్లి చేసుకుంటుంది. వీరి వెడ్డింగ్.. గోవాలో.. డిసెంబరు 12న జరగనుందని సమాచారం.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.