Trivikram Allu Arjun Movie: ఈ మధ్యకాలంలో చిన్న డైరెక్టర్లు కూడా ప్యాన్ ఇండియా రేంజ్.. సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక స్టార్ డైరెక్టర్లు అందరూ ఆల్రెడీ ప్యాన్ ఇండియా సినిమాలతోనే.. బిజీగా ఉన్నారు. కానీ ఇంకా ఈ పాన్ ఇండియా సినిమాలని మొదలు పెట్టని స్టార్ డైరెక్టర్ కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాత్రమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి.. ప్యాన్ ఇండియా సినిమాలు మొదలు పెట్టాల్సిన అవసరం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే స్టార్ హీరోలు అందరూ ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలు మాత్రమే తీస్తున్నారు. కాబట్టి త్రివిక్రమ్.. కూడా ఇప్పుడు ఇదే జోనర్ లో సినిమాలు తీయాల్సి ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతుల్లో.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా మాత్రమే ఉంది. 


బన్నీ, అట్లీ చేయాల్సిన సినిమా కూడా హోల్డ్ లోకి.. వెళ్లిపోవడంతో త్రివిక్రమ్ కి లైన్ క్లియర్ అయిపోయింది. మరోవైపు పుష్ప 2..సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ట్రేడ్ వర్గాలు కూడా బల్లగుద్ది చెబుతున్నాయి. కాబట్టి అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరగబోతుంది. ఇప్పటికే నేషనల్ అవార్డు అందుకున్న.. బన్నీ నెక్స్ట్ సినిమాలు కూడా.. వేరే లెవెల్ లో ఉండాల్సిన అవసరం ఉంది. 


మరి త్రివిక్రమ్ అలాంటి సినిమాలు తీయగలరా.. అనేది ఇప్పుడు చర్చనీయంసంగా మారింది. డైలాగులు, వన్ లైనర్లు.. ఇలాంటి వాటిల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కొట్టే వాళ్ళు లేరు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రమే.. వాటికి బాగా కనెక్ట్ అవ్వగలరు. మరి మిగతా భాష ప్రేక్షకులు.. త్రివిక్రమ్ సినిమాలకి అంత బాగా కనెక్ట్ అవ్వగలరా.. లేదా.. అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 


అయితే అరవింద సమేత.. వంటి ఊర మాస్ సినిమా తీసేదాకా.. త్రివిక్రమ్ అలాంటి ఫ్యాక్షన్ సినిమాలు తీయగలరని కూడా ఎవరు అనుకోలేదు. సినిమా అప్పట్లోనే రికార్డులు.. సృష్టించింది. కాబట్టి ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలు కూడా త్రివిక్రమ్ తీయగలరని అభిమానులు.. కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్.. సినిమా త్రివిక్రమ్ కి కీలకంగా మారబోతోంది. 


గుంటూరు కారం సినిమా తర్వాత కూడా త్రివిక్రమ్ ఇమేజ్ బాగానే.. డ్యామేజ్ అయింది. మరి అల్లు అర్జున్ సినిమాతో త్రివిక్రమ్ మళ్ళీ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారా లేదా వేచి చూడాలి. సినిమా గురించి అప్డేట్లు ఇంకా బయటకు రావాల్సి ఉన్నాయి.


Read more: Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter