Bhola Shankar Trolls Memes : భోళా శంకర్ మీద ట్రోల్స్.. మెహర్ రమేష్ పరిస్థితి పాపం అంటోన్న నెటిజన్లు
Trolls And Memes On Bhola Shankar చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ మీద ప్రస్తుతం ట్రోల్స్, మీమ్స్ పడుతున్నాయి. ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ మీద జనాలు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో మెహర్ రమేష్ నవ్వులపాలు అవుతున్నాడు.
Trolls And Memes On Bhola Shankar మెగాస్టార్ చిరంజీవి సినిమాల మీద వస్తోన్న ట్రోల్స్, మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆచార్య సినిమాలో వాడిని గ్రాఫిక్స్, చిరంజీవిని చూపించిన తీరు మీద వచ్చినన్నీ ట్రోల్స్ ఇంకెవ్వరి మీద వచ్చి ఉండవు. గాడ్ ఫాదర్ సినిమాలోని స్టిల్స్, పోస్టర్ల మీద సైతం లెక్కలేనన్ని మీమ్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు భోళా శంకర్ సినిమా వంతు వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ మీద ట్రోల్స్ వస్తున్నాయి.
అసలే భోళా శంకర్ సినిమా మీద ముందు నుంచీ ట్రోల్స్ వస్తున్నాయి. వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళా శంకర్ తెరకెక్కించడమే మెగా ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. అందులోనూ మెహర్ రమేష్‌కు చాన్స్ ఇవ్వడం కూడా నచ్చడం లేదు. ఇక భోళా శంకర్ సినిమా మీద ఎంత నెగెటివిటీ ఉందో మరోసారి రుజువైంది.
ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఎంతగానో వైరల్ అవుతోంది. ఇందులో తమన్నా, కీర్తి సురేష్‌లు కూర్చోవడం, వెనకాల చిరంజీవి నిల్చోవడం చూసి జనాలు తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు. షాపింగ్ మాల్స్ కోసం డిజైన్ చేసినట్టుగా ఈ పోస్టర్ ఉందని మీమ్స్ పడుతున్నాయి.
స్పెషల్ పోస్టర్లను కూడా సరిగ్గా డిజైన్ చేయలేరా? అంటూ మెహర్ రమేష్‌ను ఆడేసుకుంటున్నారు జనాలు. ఇప్పుడే ఇలా ఉంటే.. సినిమా రిలీజ్ అయ్యాక.. ఇంకెన్ని రకాలుగా తిట్టుకుంటారో అని జనాలు నవ్వుకుంటున్నారు. మెహర్ రమేష్ మీద, చిరంజీవి మీద, భోళా శంకర్ మీద ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి. ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేస్తామని ప్రకటించడం కూడా వివాదంగా మారింది. ఎందుకంటే అదే డేట్‌కు మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ టైంకు ఏం జరుగుతుందో.. ఎవరు వెనక్కి వెళ్తారో చూడాలి.
Also Read: Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?
Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook