Allu Arjun National Award Controversy: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు ప్రస్తావన  వస్తే అందులో మొట్టమొదటి జాతీయ అవార్డు అందుకున్న తెలుగు హీరోగా అల్లు అర్జున్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకు గానూ ఉత్తమ నటుడు విభాగంలో అల్లు అర్జున్ కి  నేషనల్ అవార్డు లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు బన్నీ కంటే బాగా నటించిన హీరో మరొకరు లేరా అంటూ కామెంట్లు కూడా వినిపించారు. మొత్తానికైతే అల్లు అర్జున్ కి  జాతీయ అవార్డు లభించడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. 
ఇకపోతే అల్లు అర్జున్ కి  జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఎన్నో చర్చలు తెరపైకి వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు కదా.. తన నటనతో జాతీయస్థాయిలో ప్రేక్షకులను మెప్పించారు కదా.. అలాంటి ఈయనకు ఎందుకు జాతీయ అవార్డు ఇవ్వలేదు అనేది అందరి ప్రశ్న. 


అయితే తాజాగా ఒక నటుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.  అయితే అల్లు అర్జున్ కంటే ముందే మెగాస్టార్ చిరంజీవికి రావాల్సి ఉంది. కానీ రాలేదు. 


చిరంజీవికి ఆపద్బాంధవుడు చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఇక ప్రకటిస్తారు అని అనుకునే లోపే నార్త్, సౌత్ అనే తేడా రావడంతో చివరి నిమిషంలో వాళ్ల వాళ్లకే జాతీయ అవార్డు ఇచ్చుకున్నారు. లేకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటి నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా చిరంజీవి నిలిచేవారు అంటూ ఆ నటుడు కామెంట్లు చేశారు.  ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. 


ఇక మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని, పద్మ విభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకున్న ఈయన ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు.


Also read: EPF Pension Updates: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఈ పద్ధతి పాటిస్తే అదనంగా 8 శాతం పెన్షన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.