EPFO Pension News in Telugu: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ ఎక్కౌంట్ తప్పనిసరి. రిటైర్మెంట్ తరువాత పెన్షన్ కూడా వస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం పీఎఫ్ ఎక్కౌంట్లో జమ అవుతుంటుంది. అయితే పెన్షనర్ 58 ఏళ్ల నుంచి కాకుండా 60 ఏళ్ల నుంచి పెన్షన్ అందుకోవడం ప్రారంభిస్తే ఏకంగా 8 శాతం అదనంగా పెన్షన్ లభిస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.
ఓ వ్యక్తి పదేళ్లపాటు భవిష్యనిధికి ప్రతి నెలా కొద్దిమొత్తం జమ చేస్తే 58 ఏళ్లు నిండేసరికి పెన్షన్‌కు అర్హుడౌతాడు. అయితే అదే పెన్షనర్ 58 ఏళ్ల నుంచి కాకుండా 60 ఏళ్ల నుంచి పెన్షన్ డ్రా చేస్తే అదనంగా పెన్షన్ పొందవచ్చు. అంటే 60 ఏళ్ల నుంచి పెన్షన్ తీసుకోవడం మొదలెడితే 8 శాతం అదనపు పెన్షన్ వర్తిస్తుంది. పదేళ్లపాటు జీతం నుంచి కొంతభాగం ప్రతి నెలా పీఎఫ్ ఎక్కౌంట్లో జమ చేస్తే చాలు..ఎవరికైనా పెన్షన్ లభిస్తుంది. పదేళ్ల కంటే తక్కువ వ్యవధిలో పీపీఎఫ్ ఎక్కౌంట్ కలిగి ఉంటే మధ్యలో ఎప్పుడైనా పెన్షన్ కోసం డిపాజిట్ చేసిన మొత్తాన్ని విత్ డ్రా చేయవచ్చు. ఈపీఎఫ్ ఖాతదారులకు రిటైర్మెంట్ తరువాత పీఎఫ్ ఫండ్ నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుంది. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పీఎఫ్ ఖాతా కొనసాగిస్తే 58 ఏళ్ల నుంచి పెన్షన్ అందుకునేందుకు అర్హుడౌతాడు. అదే పెన్షన్ 60 ఏళ్ల నుంచి తీసుకోవడం ప్రారంభిస్తే అదనంగా 8 శాతం పెన్షన్ అందుకోవచ్చు.
నిబంధనల ప్రకారం 50 నుంచి 58 ఏళ్ల వయస్సులో ఉంటే ముందస్తు పెన్షన్ పొందవచ్చు. కానీ పెన్షన్ తక్కువగా వస్తుంది. 58 ఏళ్ల లోపు పెన్షన్ తీసుకోవడం ప్రారంభిస్తే ఏడాదికి 4 శాతం చొప్పున తగ్గుతుంది. అంటే ఒకవేళ 56 ఏళ్ల వయస్సులో పెన్షన్ విత్ డ్రా చేసుకుంటే మొత్తం పెన్షన్ లో 92 శాతమే లభిస్తుంది. పీఎఫ్ ఖాతాలో పదేళ్లు పూర్తయినా 50 ఏళ్లలోపు మీ వయస్సుంటే పెన్షన్ క్లెయిమ్ చేయలేరు. ఉద్యోగం వదిలేస్తే మాత్రం పీఎఫ్ నిధుల్ని మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు. పెన్షన్ మొత్తం మాత్రం 58 ఏళ్ల తరువాతే లభిస్తుంది. అదే 58 ఏళ్లకు కాకుండా 60 ఏళ్ల వరకూ వేచి చూసి పెన్షన్ పొందితే మాత్రం అదనంగా 8 శాతం ఏడాదికి 4 శాతం పెరుగుతుంది.
Also read: Family Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.