Tunisha Sharma Post Mortem Report: ప్రముఖ టెలివిజన్ నటి, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శనివారం నాడు ఈ 20 ఏళ్ల టీవీ నటి సీరియల్ సెట్స్‌లో తన సహా నటుడి మేకప్ రూంలో ఉరి వేసుకుంది. అయితే ఆమె గర్భవతి అయిందని తరువాత ఆమె ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో ఆమె మరణించింది అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో తునీషా శర్మ పోస్టుమార్టం రిపోర్టు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా, తునీషా పోస్టుమార్టం నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిజానికి ఈ కేసులో తునీషా శర్మ మాజీ ప్రియుడు షీజన్ మహ్మద్ ఖాన్‌ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా తునీషా శర్మ శర్మకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి బయట వైరల్ అవుతోంది. అదేమంటే 20 ఏళ్ల ఈ నటి ఆత్మహత్య వార్త బయటకు వచ్చిన తర్వాత, ఆమె తల్లి కాబోతోందని సర్వత్రా చర్చ జరుగుతోంది.


అటువంటి పరిస్థితిలో, తునీషా శర్మ పోస్ట్‌మార్టం నివేదికలో ఇదంతా ఒట్టి ప్రచారమే అని తేలింది. ఇండియా టుడే నివేదికల ప్రకారం, తునీషా శర్మ గర్భవతి కాదని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. తునీషా శర్మ శరీరంపై ఎలాంటి గాయాలు లేదా గీతలు కనిపించలేదని కూడా రిపోర్టులో తేలింది. ఇక ఆమె ఉరి వేసుకున్న తరువాత ఊపిరాడక మరణించిందని తేలింది. అలాగే ఈ పోస్ట్‌మార్టం నివేదిక కూడా మరో ముఖ్యమైన ప్రశ్నను కూడా క్లియర్ చేసింది, తునీషా శర్మ మరణం హత్య కాదు ఆత్మహత్య అని తేల్చింది.


ఇక తునీషా మరణానంతరం ముంబయిలోని జేజే ఆస్పత్రిలో డిసెంబర్ 25 మధ్యాహ్నం 1:30 గంటలకు తునీషా శర్మ పోస్టుమార్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో, సుమారు 4-5 మంది వైద్యులు ఉన్నారు. ఇక ఈ పోస్ట్‌మార్టం ప్రక్రియకు సంబంధించిన వీడియోగ్రఫీ కూడా జరిగింది. మరోపక్క  తునీషా శర్మ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆదివారం వాలివ్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ చంద్రకాంత్‌ జాదవ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆమె ఉరివేసుకుని మృతి చెందినట్లు పోస్టుమార్టంలో స్పష్టమైందని, లవ్ జిహాద్ అనే విషయం ఇంకా తెరపైకి రాలేదని అన్నారు.


ఇక ఈ సీరియల్ షూటింగ్ జూన్ 2022 నుంచి జరుగుతోందని, షీజన్ - తునీషా స్నేహితులని వారు విడిపోయారని పేర్కొన్నారు. బ్రేకప్ తర్వాత ఒత్తిడితో తునీషా ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నామని పేర్కొన్న ఆయన ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఇక షీజన్‌కు 7 రోజుల రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా కోర్టు 4 రోజుల రిమాండ్ విధించింది. 


Also Read: Pawan Kalyan For Balakrishna: అన్న సినిమాకు పోటీగా వస్తున్న వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్?


Also Read: Mythri Movie Makers Love: చిరు వద్దు బాలయ్య ముద్దు.. మైత్రీ వారి సవతి ప్రేమ నిజమేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.