Mythri Movie Makers Love: చిరు వద్దు బాలయ్య ముద్దు.. మైత్రీ వారి సవతి ప్రేమ నిజమేనా?

Mythri Movie Makers Interest: మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో రూపొందిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు జనవరి 12వ తేదీన ఒకటి 13వ తేదీన మరోటి సంక్రాంతికి  సందడి చేయబోతున్నాయి. అయితే ఆ సినిమాల విషయంలో ఇప్పుడు ఆసక్తిఆక్ర ప్రచారం తెర మీదకు వచ్చింది. 

Last Updated : Dec 26, 2022, 08:07 AM IST
Mythri Movie Makers Love: చిరు వద్దు బాలయ్య ముద్దు.. మైత్రీ వారి సవతి ప్రేమ నిజమేనా?

Mythri Movie Makers Showing More Interest on Veera Simha Reddy: ఈసారి సంక్రాంతికి రెండు తెలుగు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో రూపొందిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు జనవరి 12వ తేదీన ఒకటి 13వ తేదీన మరోటి విడుదల కాబోతున్నాయి. నిజానికి తెలుగులో ఇద్దరు టాప్ హీరోలు నటించిన సినిమాలు కావడంతో ఈ సినిమాలను కాస్త గ్యాప్ తీసుకుని విడుదల చేస్తారని అందరూ భావించారు.

అయితే ముందుగా వీరసింహారెడ్డి సినిమాని 12వ తేదీన వాల్తేరు వీరయ్య సినిమాని 13వ తేదీన రిలీజ్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్ణయం తీసుకుంది. దాని వెనుక ఇద్దరు హీరోల ఒత్తిడి ఉందనేది సినీ వర్గాల వారి ప్రచారం. అయితే ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఎందుకో వీర్ సింహారెడ్డి సినిమా మీద మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎక్కువగా ప్రేమ చూపిస్తుందని ప్రచారం జరుగుతోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ఈ వీర సింహారెడ్డి అనే సినిమా రూపొందింది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. మరోపక్క చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రవితేజ ప్రధాన పాత్రలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.

దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. అయితే ప్రమోషన్స్ విషయంలో ఎందుకో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బాలకృష్ణ సినిమాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనే ప్రచారం ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగో కొండారెడ్డి బురుజు వద్ద ఒక భారీ ఈవెంట్ పెట్టి మరీ లాంచ్ చేశారు.  అలాగే ఇటీవల విడుదల చేసిన మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే సాంగ్ కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ రేంజ్ లో చేశారు.

అయితే ఈ రేంజ్ లో వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ మాత్రం చేయడం లేదని మెగా అభిమానుల భావిస్తున్నారు. కావాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తమ సినిమా మీద సవతి ప్రేమ చూపిస్తుందని బాలకృష్ణ సినిమాకి ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ తమ సినిమా మీద ఎందుకు ఎక్కువ ఆసక్తి కనబరచడం లేదని భావిస్తున్నారు. అయితే వారిని సమాధాన పరిచేందుకే అన్నట్లుగా తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది. మెగా అభిమానులే అతిథులుగా వాల్తేరు వీరయ్య సెలబ్రేషన్స్ పేరుతో ఒక ఈవెంట్ జరిపారు. మరి ఈవెంట్తో అయినా మెగా అభిమానుల బాధ కాస్తయినా తగ్గుతుందేమో చూడాలి.

Also Read: Tunisha Sharma Suicide: 'అన్నిటికన్నా ప్రేమే ఎక్కువ' టాటూ వేయించుకున్న తునీషా!

Also Read: Chalapathi Rao Died : చికెన్ బిర్యానీ తిని వెంటనే చనిపోయారు.. అసలు విషయం బయటపెట్టిన రవిబాబు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News