Tragedy at Vishnupriya home: నటి విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం.. ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్!
Tv Actress Vishnupriya Father Passed Away: తెలుగు టీవీ సీరియల్ నటి విష్ణు ప్రియా ఇంట తీవ్ర విషాదం నెలకొంది, ఆమె తండ్రి అనారోగ్య కారణాలతో కన్నుమూయగా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వివరాలు
Tragedy at Tv Actress Vishnupriya House: తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు టీవీ పరిశ్రమలో బిజీగా అనేక సీరియల్స్ నటిస్తున్న విష్ణు ప్రియ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాజాగా తెలుగు టీవీ నటి విష్ణు ప్రియ తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది విష్ణు ప్రియ. ఈ సందర్భంగా తాను చిన్నప్పటి నుంచి కొండంత అండగా భావించే తన తండ్రిని కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తండ్రితో కలిసి ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ మా హృదయం ఎప్పటికీ కోల్పోలేదు నాన్న మా సూపర్ హీరో, అతిపెద్ద ఆశీర్వాదం అందించే వ్యక్తిని కోల్పోయాను, ప్రతిక్షణం నేను మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాను అని పేర్కొంది. ఇక కొన్నాళ్లుగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న విష్ణు ప్రియ తండ్రి వారం రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయనను డాక్టర్లు కాపాడలేకపోయారు/ ఈ సందర్భంగా ఆయన కన్నుమూయడంతో తన కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది విష్ణు ప్రియ.
విష్ణు ప్రియ తెలుగులో అనేక సీరియల్స్ లో నటించింది అలాగే పలు సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతానికి ఆమె తెలుగులో త్రినయని, జానకి కలగనలేదు వంట సీరియల్స్ తో బిజీగా ఉంది. అలాగే మరోపక్క తమిళ్ సీరియల్స్ లో కూడా నటిస్తోంది. ఇక ఆమె తన సీరియల్ కో స్టార్ ఆయన సిద్ధార్థ వర్మను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.
ఇక ఇంతకంటే ముందు ఆమె అభిషేకం, కుంకుమపువ్వు, ఇద్దరమ్మాయిలు వంటి సీరియల్స్ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక సినిమాల్లో కూడా ఆమె గుర్తు పెట్టుకోదగ్గ పాత్రలలో నటించింది. ఇక ఆమె తండ్రిని కోల్పోయింది అన్న విషయం తెలుసుకుని ఆమె తోటి సీరియల్ ఆర్టిస్టులు, సినీ ఆర్టిస్టులు ఆమెకు అండగా నిలబడి ధైర్యం చెబుతున్నారు.
Also Read: Ram Charan Buchi Babu Movie: ఎన్టీఆర్ వద్దనుకున్న కథను ఫైనల్ చేసిన రామ్ చరణ్?
Also Read: Nagashaurya Hospitalised: వారంలో పెళ్లనగా నాగశౌర్యకు అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook