హైదరాబాద్: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ( TV actress Sravani suicide case ) కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. శ్రావణి ఆత్మహత్యకు కాకినాడకు చెందిన దేవరాజ్ రెడ్డినే ( Devaraj Reddy ) కారణమని.. ప్రేమ పేరుతో అతడి వేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మౌనరాగం, మనసు మమత లాంటీ సీరియల్స్‌లో ( Mounaragam, Manasu mamatha serials artist Sravani ) నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న శ్రావణి ఉన్నట్టుండి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. Also read : TV serial actress Shravani: వేధింపులు తాళలేక బుల్లితెర నటి బలవన్మరణం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రావణి ఆత్మహత్య కేసులో తన పేరు వినిపిస్తుండటాన్ని ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేసిన దేవరాజ్.. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని మరో వెర్షన్ వినిపించాడు. శ్రావణి తనని ప్రేమించిన మాట వాస్తవమేనని.. కాకపోతే గతంలో శ్రావణి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే ఆమె తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని దేవరాజ్ తెలిపాడు. ఇటీవలే శ్రావణిని సాయి అనే వ్యక్తి రోడ్డుపైనే జుట్టుపట్టుకుని కొట్టాడని శ్రావణి తనతో చెప్పుకుని బాధపడిందని దేవరాజ్ తన వీడియోలో పేర్కొన్నాడు. Also read : Rhea Chakraborty's bail plea: రియా చక్రవర్తికి షాక్ ఇచ్చిన కోర్టు


ఓవైపు సాయి, మరోవైపు తన తల్లిదండ్రులు తనను తీవ్రంగా హింసిస్తున్నారని శ్రావణి తనతో చెప్పుకుందని.. ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉన్నందున మూడు రోజుల్లో షూటింగ్ ముగించుకుని నీ వద్దకు వస్తానని నాతో చెప్పిందని దేవరాజ్ పేర్కొన్నాడు. ఇంట్లో తన తండ్రి, తమ్ముడు తనని తీవ్రంగా హింసించినట్టు స్వయంగా శ్రావణినే తనకు ఫోన్ చేసి చెప్పిందని దేవరాజ్ చెప్పుకొచ్చాడు. అవసరమైతే అందుకు సంబంధించిన కాల్ డేటా ( TV actress Sravani call data ) ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ దేవరాజ్ పలు కాల్ రికార్డింగ్ డేటాను ( Sravani call recordings ) మీడియాకు విడుదల చేశాడు. శ్రావణి చెప్పిన వివరాల ప్రకారం ఆమె సాయి వేధింపులతో పాటు తన తల్లిడండ్రుల హింస వల్లే ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ ఆరోపించాడు. Also read : Director Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్‌ ఎవరో తెలుసా ?


శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్ రెడ్డి చెబుతున్న వెర్షన్ కట్టుకథేనా ? తనపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే దేవరాజ్ ఈ ఆరోపణలు చేస్తున్నాడా లేక ఇందులో నిజం ఉందా అని తెలుసుకునేందుకు పోలీసులు మరింత లోతైన విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. Also read : Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్ 4 షోలో‌కి ఎట్లొచ్చింది ?