TV serial actress Shravani: వేధింపులు తాళలేక బుల్లితెర నటి బలవన్మరణం

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌ మధునగర్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె సుమారు ఎనిమిదేళ్లుగా బుల్లితెర నటిగా పనిచేస్తోంది.

Last Updated : Sep 9, 2020, 08:31 AM IST
TV serial actress Shravani: వేధింపులు తాళలేక బుల్లితెర నటి బలవన్మరణం

TV actress Shravani commits suicide: హైదరాబాద్‌: బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య (tv actress shravani suicide) చేసుకుంది. హైదరాబాద్‌ మధునగర్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె సుమారు ఎనిమిదేళ్లుగా బుల్లితెర నటిగా పనిచేస్తోంది. శ్రావణి మనసు మమత, మౌనరాగం సీరియల్స్‌తోపాటు.. పలు సీరియల్స్‌లో నటించింది. అయితే ఓ యువకుడి వేధింపులతోనే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కొంతకాలం క్రితం ఓ యువకుడు శ్రావణికి టిక్‌టాక్‌ ద్వారా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి పరిచయం అయ్యాడని.. అప్పటినుంచి ఆ యువకుడు ప్రేమ పేరుతో సన్నిహితంగా ఉంటూ.. ఫొటోలు దిగి డబ్బులు ఇవ్వమంటూ వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతని వేధింపులతో శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. Also read: Rhea Chakraborty's bail plea: రియా చక్రవర్తికి షాక్ ఇచ్చిన కోర్టు

వేధింపులు ఎక్కువ కావడంతో ఇటీవల ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాత్‌రూంలోకి వెళ్లి ఉరి వేసుకుంది. ఎంతసేపటికీ రాకపోవడంతో గమనించిన కుటుంబసభ్యులు డోర్ పగలగొట్టి శ్రావణిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రావణి మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. అయితే.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డిపై పోలీసులు (HYD Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also read : Antarvedi radham issue: అంతర్వేది రథం దగ్ధం.. సర్కారుపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x