20 Movies to release in Telugu in December 2022: ఎట్టకేలకు నెలాఖరుకు వచ్చేసాము, ఈ ఏడాదికి ఇంకా డిసెంబర్ నెల ఒకటే మిగిలి ఉంది. ఇంకా ఈ ఏడాది ఏవైనా సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అది కేవలం డిసెంబర్ నెలలో మాత్రమే విడుదలవుతాయి. ఇక ఈ ఏడాది డిసెంబర్ నెలలో దాదాపు 20 సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో చెప్పుకోదగ్గ సినిమాలు నాలుగైదు ఉన్నా చిన్న సినిమాలన్నీ కలిపి మరో 15 దాకా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా మొత్తం 20 సినిమాలు ఈసారి డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా డిసెంబర్ రెండో తేదీన నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో హిట్ రెండో భాగం విడుదలవుతోంది, అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక విష్ణు విశాల్ హీరోగా నటించిన మట్టి కుస్తీ కూడా అదే రోజున రిలీజ్ అవుతుండగా ప్రేమదేశం, దోస్తాన్ అని మరో రెండు సినిమాలు కూడా అదే రోజు విడుదలవుతున్నాయి.


ఇక డిసెంబర్ 9వ తేదీన అయితే ఏకంగా ఏడు సినిమాలు విడుదలవుతున్నాయి. చెప్పాలని ఉంది, లెహరాయి, పంచతంత్రం, విజయానంద్, మా ఇష్టం, నమస్తే శేట్ జీ, డాక్టర్ 56  వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక అదే విధంగా డిసెంబర్ 16వ తేదీన అవతార్ ది వే ఆఫ్ వాటర్, యూ టర్న్ 2 అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే డిసెంబర్ 21వ తేదీన అన్ని మంచి సుగుణములే అనే సినిమా రిలీజ్ అవుతుంది.


ఇక 22వ తేదీ విశాల్ హీరోగా నటిస్తున్న లాఠీ అనే సినిమా రిలీజ్ అవుతుంటే రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా, కార్తికేయ 2 హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న 18 పేజెస్ అనే సినిమాలు 23వ తేదీ విడుదలవుతున్నాయి. ఇక వేద అనే సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 30వ తేదీ టాప్ గేర్, వైన్ షాప్, ఎట్ ఏ టైం ఇన్ దేవరకొండ అనే సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఈ సినిమాలు రిలీజ్ అవ్వడం దాదాపు ఖాయమైనా చివరి నిమిషంలో ఏవైనా మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.
Also Read: Itlu Maredumilli Prajaneekam Review : అల్లరోడి కొత్త సినిమా ఎలా ఉందో తెలుసా?


Also Read: Maredumilli Vs Thodelu: పూర్తి భిన్నమైన లైన్స్ లో సాగిన మారేడుమిల్లి- తోడేలు.. లైన్స్ ఏమేంటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook