Mohan babu - Rajinikanth: ఒకే విమానంలో పాపారాయుడితో పెదరాయుడు.. రజినీతో మోహన్ బాబు పిక్ వైరల్..
Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరి స్నేహానికి దాదాపు 40 యేళ్లకు పైగా చరిత్ర ఉంది.తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక విమానంలో కలిసి ప్రయాణం చేస్తూ ఓ ఫోటో క్లిక్ అనిపించారు.
Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరిదీ టైమ్ లెస్ స్నేహం. అంతేకాదు మోహన్ బాబు కోసం అప్పట్లో రజినీకాంత్.. పెదరాయుడు సినిమా కథను మోహన్ బాబుకు వినిపించి.. ఆ సినిమా హక్కులు కొనేటట్టు చేసాడు. అంతేకాదు ఆ సినిమాలో మోహన్ బాబు తండ్రి పాత్ర అయిన పాపారాయుడు పాత్రలో తలైవా నటించి మెప్పించాడు. ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాతో మోహన్ బాబును అందరు కలెక్షన్ కింగ్ నుంచి టాలీవుడ్ పెదరాయుడు అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సినిమాలో నటించినందుకు రజినీకాంత్ అసలు రెమ్యునరేషన్ తీసుకోవకపోవడం విశేషం. కేవలం మోహన్ బాబుతో స్నేహం కారణంగా ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించారు.
అంతేకాదు తెలుగు సినీ చరిత్రలో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమాకు పోటీ చిరంజీవి బిగ్ బాస్ కూడా అదే రోజు విడుదలైన అడ్రస్ లేకుండా పోయింది. అంతేకాదు సామాన్య జనాల్లో ఎవరైన ఏదైనా విషయంలో కలుగ చేసుకుంటూ ఉంటే... తీర్పు ఇవ్వడానికి వచ్చాడురా పెదరాయడు అనే డైలాగ్ కూడా ఫేమస్ అయింది.
తెలుగులో పెదరాయుడు సినిమాను రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను హిందీలో ‘బులందీ’ పేరుతో అనిల్ కపూర్ రీమేక్ చేసాడు. అక్కడ కూడా పాపారాయుడు పాత్రలో రజినీకాంత్ నటించడం విశేషం.అక్కడ ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది.
ఆ సంగతి పక్కన పెడితే.. రజినీకాంత్ ఇంట్లో ఏదైనా వేడుక జరిగితే.. మోహన్ బాబు ఉండాల్సిందే. అలాగే ఈ పెదరాయుడు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తలైవా ఉండాల్సిందే. ప్రస్తుతం రజినీకాంత్ ‘వెట్టాయన్’ సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. దాంతో పాటు కూలి సినిమా చేస్తున్నాడు. అటు మోహన్ బాబు తానే నిర్మాతగా తన తనయుడు మంచు విష్ణు హీరోగా ‘కన్నప్ప’ అనే భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా జాన్ జిగ్రి దోస్తులైన ఈ ఇద్దరు వాళ్ల వాళ్ల సినిమాలతో సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం.
Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook