Suriya Remuneration for Kamal Haasan's Vikram Movie: యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'విక్రమ్‌'. నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్‌..  కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాడు. మొదటి రోజు రూ.45 కోట్లకు పైగా వసూల్ చేసిన విక్రమ్‌.. తాజాగా రూ.150 కోట్ల మార్క్‌ను అందుకుంది. పాజిటివ్ టాక్, వీకెండ్‌ కలిసిరావడంతో కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ కమల్‌ దుమ్మురేపుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలెంటెడ్ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమాలో స్టార్ హీరోలు నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించగా.. తమిళ స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్‌ చేశాడు. సూర్య చివర్లో మెరిసినా.. సినిమాకు కీలకంగా మారింది. సినిమా మొత్తం ఒక ఎత్తైతే, సూర్య కనిపించిన గెస్ట్ రోల్ మరో ఎత్తు. దాంతో ఈ గెస్ట్ రోల్‌కి సూర్య భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. 


కమల్ హాసన్ మీదున్న గౌరవంతోనే సూర్య ఒక్క రూపాయి పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది. ఖైదీ 2తో సూర్య పాత్రకి లింక్ ఉన్న విషయం వాస్తవమే. ఖైదీ2లో నటించేటప్పుడు.. ఎలాగూ ఆ సినిమాకి పారితోషికం అందుతుంది. అందుకే విక్రమ్‌లో చేసిన గెస్ట్ రోల్‌కి ఏమీ తీసుకోలేదు. ఈ సినిమా కోసం కమల్ 50 కోట్లు,  విజయ్‌ సేతుపతి 10 కోట్లు, ఫహద్‌ ఫాజిల్‌ 4 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. 


Also Read: AP SSC Results 2022: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి! 71 స్కూళ్లలో అందరూ ఫెయిల్ 


Also Read: Get Well Soon SRK: ఆందోళన చెందుతున్న ఫాన్స్.. ట్విటర్‌ ట్రెండింగ్‌లో 'గెట్‌ వెల్‌ సూన్‌ షారుఖ్‌ ఖాన్'!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook