Cannes Film Festival 2022: కేన్స్ ఫెస్టివల్ 2022లో బారతదేశ చలనచిత్ర పరిశ్రమ, ఓటీటీ వేదికల మార్కెట్ ప్రస్తావన జరిగింది. విదేశాలతో పోలిస్తే ఇండియాలో వస్తున్న ఆదాయం వివరాలు ఎలా ఉన్నాయి..కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఏమంటున్నారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేన్స్ ఫెస్టివల్ 2022లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ కీలక విషయాలు ప్రస్తావించారు. భారతీయ సినిమాకు సంబంధించిన అన్ని అంశాలపై మాట్లాడారు. దేశంలో ఓటీటీ మార్కెట్ ప్రతి యేటా 21 శాతం పెరుగుతోందని చెప్పారు. కేన్స్ ఫెస్టివల్ 2022లో ఈసారి భారతీయ నటీనటులతో కలిసి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ పాల్గొన్నారు. దేశంలో ఓటీటీ మార్కెట్‌పై ఇండియా తరపున మాట్లాడారు. దేశంలో ప్రతియేటా 21 శాతం చొప్పున పెరుగుతున్న ఓటీటీ మార్కెట్ విస్తరణ గురించి వివరించారు.


2024 వరకూ 2 బిలియన్లకు చేరుకుంటామని..అదే 2040 వరకూ ఎక్కడికి చేరకుంటామనేది అంచనా వేయలేమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలోని ఓటీటీ వేదికలు..విదేశీ ఓటీటీ వేదికల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయన్నారు. దేశంలోని మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ.. క్రియేటివ్ ఎకానమీతో పాటు విదేశాల్లో దేశం ఖ్యాతిని ఇనుమడించేలా సమర్ధవంతమైన పాత్ర పోషిస్తోందన్నారు. 


కేన్స్ ఫెస్టివల్ 2022లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ , శేఖర్ కపూర్, నవాజుద్దీన్ సిద్దీఖి వంటి నటులతో కలిసి పాల్గొన్నారు. ప్రపంచ కంటెంట్ మార్కెట్‌కు ఇండియా హబ్‌గా మారే అవకాశాలు, సత్తా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేన్ ఫెస్టివల్ 2022ను ఉద్దేశించి ఓ సందేశం పంపించారు. 75వ కేన్స్ ఫెస్టివల్‌లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్..ఇండియన్ పెవిలియన్‌కు శంకుస్థాపన చేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరింత ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు.


ఈసారి ఇండియా..మొత్తం ప్రపంచానికి భారతీయ సినిమా మహోన్నతి, సాంకేతిక పరిజ్ఞానంలో ప్రగతి, కంటెంట్ సామర్ధ్యాన్ని చూపించాలనుకుంటోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. నేషనల్ ఫిలిమ్ హెరిటేజ్ మిషన్‌లో భాగంగా అతిపెద్ద ఫిల్మ్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్టు గురించి ఆయన వివరించారు. 


Also read: Shalini Pandey Photos: సైజ్ జీరో పరువాలను ఒలకబోస్తున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.