Mahesh Babu Birth Day: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu)కు అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 09న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతిని ఇచ్చారు. అంతరిక్షంలో ఓ నక్షత్రానికి ‘సూపర్ స్టార్ మహేష్‌ బాబు’ (SuperStar Mahesh Babu) అని పేరు పెట్టారు. అంతేకాకుండా రిజిస్టర్ కూడా చేయించారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. RA: 12H 33M 29S అనే స్టార్‌కు మహేష్‌ పేరు పెట్టారు. అంతేకాకుండా గెలాక్సీలో ఎక్కువగా ఇష్టపడే నక్షత్రం ఇదేనంటూ వారు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ నక్షత్రానికి హీరో పేరు పెట్టడం ఇదే తొలిసారి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం'(Guntur kaaram) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఓ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మహేష్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ మూవీకి  ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. మరోవైపు మహేష్-రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటి నుంచే మహేష్ సిద్దమవుతున్నాడు. దాని కోసం జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. 


Also read: Alia Bhatt: హాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కి తెలుగు నేర్పించిన ఆలియాభట్‌, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook