Unstoppable With NBK Season4 1st Promo నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తోన్న అన్ స్టాపబల్  సీజన్ 4కు అంతా రెడీ అయింది.  సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ కు ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుతో షురూ కానుంది. గతంలో రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా చంద్రబాబుతో ప్రారంభమైంది. అపుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఈ టాక్ షోకు విచ్చేసారు. ఈ సారి ముఖ్యమంత్రిగా ఈ టాక్ షోకు హాజరు కావడం విశేషం.  ఈ టాక్ షోకు సంబంధించిన షూటింగ్ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. తాజాగా ఈ టాక్ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్బంగా విడుదల చేసిన  ప్రోమోలో మా బావగారు.. మీ బాబు గారు.. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆంధ్ర ప్రదేశ్ గత ప్రభుత్వ హయాములో కక్ష్య రాజకీయాలు మొదలయ్యాయి. నేను మాత్రం వాటికి దూరంగా ఉంటాను. కానీ తప్పు చేస్తే మాత్రం ఒదిలే ప్రసక్తి లేదంట చంద్రబాబు చెప్పుకొచ్చారు.




ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ఆకాశంలో సూర్య చంద్రులు..ఆంధ్రాలో బాబు, పవన్ బాబు  అంటున్నారు. దీనికి చంద్రబాబు సమాధానం చెబుతూ.. మీరు (బాలయ్య) ఎలాగైతే సినిమాల్లో అన్ స్టాపబుల్ గా ఉన్నారో.. రాజకీయాల్లో నేను అన్ స్టాపబుల్ అంటూ చెప్పడం కొసమెరుపు. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చి అటు మెగాభిమానుల్లో కూడా ఈ ఎపిసోడ్ పై ఆసక్తి రేకెత్తించారు. మొత్తంగా నందమూరి, నారా, మెగా ఫ్యాన్స్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 25న ఆహా ఓటీటీలో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రానుంది.ప్రోమోతోనే ఈ ఎపిపోడ్ చూసేలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మరి చంద్రబాబుతో బాలయ్య బాబు ఎలాంటి క్వశ్చన్స్ వేసారు. దానికి బాబు ఎలాంటి సమాధానాలు ఇచ్చారో తెలియాలంటే ఈ నెల 25 వరకు వెయిట్ చేయాల్సిందే. 


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter