Upasana Konidela: ఉపాసన కొణిదెల .. మెగా కోడలిగా ఓ ఎంటర్ ప్రెన్యూర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మెగా హీరోలు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వకముందు వరకు వారికి సంబంధించి కార్యక్రమాలను తనే పర్యవేక్షించేది. తాజాగా ఉపాసన కొణిదెల.. వెల్ నెస్ ఇండస్ట్రీలో  ఓ శక్తిగా ఉన్న ఆమె ఫస్ట్ టైమ్ మహిళలకు వ్యాపార రంగంలో సుస్థిరమైన వ్యవస్థను క్రియేట్ చేడయం  కోసం తనతో చేరమని పిలుపునిస్తున్నారు.అంతేకాదు మహిళకు  పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వ్యాపార వేదికను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రొఫెసర్‌ భగవాన్‌ చౌదరితో కలిసి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్ బిజినెస్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపాసన కొణిదెల మాట్లాడుతూ.. మహిళ విజయానికి అవసరమైన మార్గదర్శకత్వం, వనరులు, ఛాన్సులు అందించేందుకు తాను ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నట్టుగా చెప్పారు.
ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  పాత పద్దతులను పక్కన పెట్టి వ్యాపార రంగంలో సత్తా చాటాలని ఉపాసన పిలుపునిచ్చారు.


మహిళల్లో ఉన్న సృజనాత్మకత, నాయకత్వ పటిమ, సోషల్ ఇస్యూస్ ను మార్చే మార్చే శక్తికి ఓ వేదికను నిర్మించాలనేదే తన లక్ష్యమన్నారు ఉపాసన. 'నేను ప్రతి మహిళా వ్యాపారవేత్తను వెల్‌నెస్ ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తున్నాను. మనందరం కలిసి ఓ శక్తివంతమైన వేదికను నిర్మిద్దామన్నారు.  అందరి సహకారంతో ఎంతటి పోటిలో అయినా గెలుపు సాధించవచ్చన్నారు. మన సమిష్టి శక్తితో వెల్‌నెస్‌ రంగంలోకి రాబోయే కొత్త తరానికి మార్గాన్ని సుగమం చేస్తామని పిలుపు నిచ్చారు ఉపాసన.


ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ కావాలనుకుంటున్న వారు.. తమ బిజినెస్ సొసైటీ పై కలిగించే ప్రభావం.. ప్రపంచానికి జరిగే మంచి అలాగే ఉపాసనను సహ వ్యవస్థాపకురాలిగా ఎందుకు కోరుకుంటున్నారనే విషయాలను వివరిస్తూ ఓ మెయిల్‌ cofounder@urlife.co.inకు పంపాలని కోరారు .వెల్‌నెస్ భవిష్యత్తును తిరిగి పునర్నిర్మించడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో ఉపాసనతో చేరండన్నారు. ప్రస్తుతం ఉపాసన కొణిదెల ప్రస్తుతం అపోలో గ్రూపుకు సంబంధించిన వ్యవహారాలతో పాటు మెగాకుటుంబానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది.


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.