Upasana Konidela Baby Bump Photos Viral: అపోలో అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెద్దలను ఒప్పించి కొన్నేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగే పదేళ్లు అవుతూ ఉండడంతో వీరికి ఎప్పుడు పిల్లలు పుడతారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకానొక సందర్భంలో అసలు వీరికి పిల్లలను కనడం ఇష్టమే లేదని చర్చ కూడా జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఈ విషయం మీద ఎప్పటికప్పుడు రామ్ చరణ్ ఉపాసన తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. పిల్లలను కని పెంచడం అనేది చాలా గొప్ప విషయమని దానికి తమకు కాస్త సమయం కావాలని వీరిద్దరూ కోరుతూ వచ్చారు. ఇక ఇటీవల ఉపాసన తల్లి కాబోతోంది అంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే మెడికల్ ఫీల్డ్ లో చాలా అనుభవం ఉన్న ఉపాసన నేరుగా పిల్లలను కనడం లేదని ఆమె సరోగసి ద్వారా పిల్లలను కనబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.


వాస్తవానికి నయనతార తల్లి అయినట్లు ప్రకటించిన సమయంలోనే ఈ విషయం మీద పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. భారతదేశంలో సరోగసి చట్టం విషయంలో కొన్ని నిషేధాజ్ఞలు ఉన్నాయి, కాబట్టి రామ్ చరణ్ భార్య ఉపాసన ఆ విధంగా ముందుకు వెళుతుందా లేదా అనే విషయం ఏదైతే చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆమె అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడం లేదనే విషయం మీద ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.


అసలు విషయం ఏమిటంటే తాజాగా ఉపాసన కజిన్ ఒకరి పెళ్లి కోసం రామ్ చరణ్ ఉపాసన దంపతులు థాయిలాండ్ వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా ఉపాసన దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఉపాసన బేబీ బంపుతో కనిపిస్తూ ఉండడంతో అందరూ ఈ విషయం మీదే చర్చ చేస్తున్నారు.


ఆమె ఒకవేళ సరోగసి ద్వారా పిల్లలను కంటే బీబీ బంపు కనిపించదు కదా మొత్తం మీద ఉపాసన బేబీ బంప్ వ్యవహారం మీద అభిమానులలో ఉన్న అనుమానాలు అయితే తొలగిపోయాయని చెప్పాలి. ఇక మెగా అభిమానులు కూడా మెగా వారసుడు కోసం విపరీతంగా అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి ఈ దంపతులకు వారసుడు జన్మిస్తాడో లేక వారసురాలు జన్మిస్తుందో అనేది. 
Also Read: Sridevi Chiranjeevi Song : బాస్ గ్రేస్ అదుర్స్.. దేవీ బీట్ సూపర్.. శ్రుతి అందాలు హైలెట్


Also Read: Sridevi Chiranjeevi Song : శ్రీదేవీ చిరంజీవి సాంగ్ ఆలస్యం.. మైత్రీని ఆడుకుంటున్న ఫ్యాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook