Upasana Konidela: పిల్లల్ని కనొద్దన్న సద్గురు.. ఉపాసన ఏమన్నారో తెలుసా?
Upasana Konidela: తాజాగా ఆధ్యాత్మిక గురువు కోయంబత్తూర్ లోని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు దగ్గర పిల్లల కన్నడం విషయం మీద ఉపాసన ఓపెన్ అయింది.
Upasana Konidela Comments on pregnancy: మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయాలలో మెగా వారసుడి అంశం కూడా ఒకటి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు అకీరా, శంకర పవనోవిచ్, నాగబాబుకు వరుణ్ తేజ్ ఉన్నారు. కానీ మెగాస్టార్ కుమారుడు పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనల పెళ్ళై పదేళ్లు దాటుతున్నా వారికి సంతానం కలగక పోవడంతో వారి అభిమానుల ఎదురు చూపులన్నీ వారి సంతానం గురించే. అయితే రామ్ చరణ్ ఉపాసనల ఫ్యామిలీ ప్లానింగ్ లు వారికి ఉండి ఉండవచ్చు కానీ వీరికి సంతానం ఎప్పుడు కలుగుతుందా? వారసుడిని ఎప్పుడు చూస్తామా? అంటూ అభిమానులు మాత్రం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వీరి సంతానం గురించి మీడియాలో సోషల్ మీడియాలో కూడా పలు కథనాలు పుట్టుకొస్తూ ఉంటాయి, .
కానీ వాటిని ఖండించడమే తప్ప నేరుగా ఎప్పుడూ కూడా ఆ విషయం మీద క్లారిటీగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఉపాసన సైతం అనేక సంధర్భాల్లో సంతానం ఎప్పుడు? పిల్లల్ని కనేది ఎప్పుడనే ప్రశ్న ఎదురైనప్పుడల్లా ఏదో ఒక విధంగా వాటిని దాటవేస్తూ వచ్చేది. కానీ తాజాగా ఆధ్యాత్మిక గురువు కోయంబత్తూర్ లోని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు దగ్గర పిల్లల కన్నడం విషయం మీద ఉపాసన ఓపెన్ అయింది. తాను పెళ్లి చేసుకుని పదేళ్లు అవుతోందని, పెళ్లి తర్వాత వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతోందని సద్గురుతో మాట్లాడుతూ ఉపాసన చెప్పుకొచ్చారు. తాను తన కుటుంబాన్ని కుటుంబ జీవితాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చారు.
ప్రజలు ఇవేవీ పట్టించుకోకుండా తన జీవితంలో ఉన్న మూడు ఆర్ఆర్ఆర్ ల గురించి ఎక్కువ చర్చించుకుంటున్నారని చెబుతూ రిలేషన్షిప్, రీప్రొడ్యూస్, రోల్ అంటూ తనకు పుట్టబోయే పిల్లల గురించి జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయాన్ని సద్గురు దృష్టికి తీసుకువెళ్ళింది. ఈ వ్యవహారం మీద సద్గురు ఆసక్తికరంగా స్పందిస్తూ రిలేషన్షిప్ అనేది నీ వ్యక్తిగత విషయం అని అందులో ఎవరు తల కూడా దూర్చకూడదని చెప్పుకొచ్చారు. అయితే రెండోది పిల్లలకు కనకుండా ఉండే వారందరికీ తాను అవార్డులు ఇస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ తరం వాళ్లు పిల్లలు కనాల్సిన అవసరం లేదని ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా మరీ ఎక్కువ అయిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఒకవేళ నువ్వు ఆడపులివి గనక అయ్యుంటే అప్పుడు పిల్లల్ని కనమని సలహా ఇచ్చేవాడిని ఎందుకంటే మనుషులు ఎక్కువైపోయి పులులు అంతరించిపోతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పిల్లలను కనడం గురించి సద్గురు చేసిన కామెంట్స్ విన్న ఉపాసన సరే కనను అనకుండా మీరలా అంటున్నారు కదా మీకు మా అమ్మ గారి నుంచి అత్తయ్య గారి నుంచి ఫోన్లు వస్తాయంటూ సరదాగా కామెంట్ చేసింది. దానికి సద్గురు కూడా ఆసక్తికరంగా స్పందిస్తూ నాకు మీ అమ్మగారు అత్తగారు నుంచే కాదు చాలామంది అమ్మలు, అత్తల నుంచి ఫోన్లు వస్తుంటాయి అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ విషయం మీద మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసనకు పిల్లల్ని కనే ఉద్దేశం ఉందని కాబట్టి తాము టెన్షన్ పడే అవసరం లేదని వారు భావిస్తున్నారు.
Also Read: R Narayana Murthy Mother Death: ఆర్ నారాయణ మూర్తికి మాతృవియోగం!
Also Read: Nayanathara - vignesh shivan: చెన్నైలోని పోష్ ఏరియాలో రెండు బంగ్లాలు కొన్న నయనతార.. అని కోట్లా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook