Upasana on Pregnancy: నచ్చినప్పుడే పిల్లల్ని కంటున్నాం.. సంతోషంగా ఉంది: ఉపాసన
Ram Charan Wife Upasana on Pregnancy: ఉపాసన కొణిదెల తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పుకొచ్చింది. తామిద్దరం తీసుకున్న ఉమ్మడి నిర్ణయమే ఇదని, తాము కోరుకున్న టైంకే పిల్లల్ని కంటున్నామని, ఏదో సమాజం ఒత్తిడి తలొగ్గి కనలేదని చెప్పుకొచ్చింది.
Ram Charan Wife Upasana Konidela Comments on Her Pregnancy: ప్రస్తుతం మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటోంది. రామ్ చరణ్‌కు త్వరలోనే తండ్రి కాబోతోన్నాడు. పాపో, బాబో పుట్టబోతోన్నాడు. అయితే అంతా కూడా వారసుడు రావాలని, జూ. రామ్ చరణ్ రావాలని కోరుకుంటున్నారు. సుష్మిత, శ్రీజ కూడా ఇదే కోరుకున్నారు. తమ ఇంట్లో ఇప్పుడు ఎక్కువగా ఆడపిల్లలే పుడుతున్నారని, మా జనరేషన్‌లో అబ్బాయి ఇంకెవ్వరికీ పుట్టలేదని, అందుకే రామ్ చరణ్‌కు బాబు పుడితే బాగుంటుందని సుష్మిత చెప్పుకొచ్చింది.
తాజాగా ఉపాసన కూడా తాను గర్భం దాల్చడం, ఇన్నాళ్లు సమాజం నుంచి వచ్చిన విమర్శలపై స్పందించింది. ఇప్పుడు ఈ టైంలో పిల్లల్ని కనడం ఆనందంగా ఉందని, తాను ఇష్టపడిన టైంకే పిల్లల్ని కంటున్నాను అని ఉపాసన జాతీయ మీడియాతో పంచుకుంది. ఇంతకీ ఆమె చెప్పిన విషయాలు ఏంటంటే..
తల్లిని కాబోతోన్నాను అని ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. అయితే సమాజం ఒత్తిళ్లకు తలొగ్గి, ఇంట్లో వాళ్ల ఒత్తిళ్లు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఒత్తిళ్లకు తలొగ్గి మేం పిల్లల్ని కనడం లేదు.. మాకు నచ్చినప్పుడు అనుకున్నప్పుడే పిల్లల్ని కంటున్నాం. మా పదేళ్ల వివాహా బంధం తరువాత మేం పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాం.. ఇదే మాకు సరైన సమయం అని అనిపించింది.. ఇప్పుడు మేం ఆర్థికంగానూ ఎంతో స్థిరంగా ఉన్నాం.. మా పిల్లల్ని మేం ఇప్పుడు పెంచుకోగలమన్న నమ్మకం ఏర్పడింది. అందుకే అడుగు ముందుకేశామని ఉపాసన చెప్పుకొచ్చింది.
ఇది మా ఉమ్మడి నిర్ణయం. భార్యాభర్తలుగా మా మీద ఎలాంటి ఒత్తిడి రాకుండా ఉండాలని అనుకున్నాం. ఫ్యామిలీ నుంచైనా, సమాజం నుంచైనా వచ్చే విమర్శలను పట్టించుకోవద్దని అనుకున్నాం. మా బంధం గురించి, మేం పిల్లల్ని ఎలా పెంచుతామో అని అందరూ అనుకుంటారు.. ఆ ఒత్తిళ్లేమీ తమ మీద ప్రభావం చూపించకుండా ఉండాలని అనుకుంటామని ఉపాసన తెలిపింది.
Also Read: Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?
Also Read: Ritika Nayak Pics : లోపల ఏమీ వేసుకోకుండా రితికా నాయక్ రచ్చ.. రెచ్చిపోయిన విశ్వక్ సేన్ బ్యూటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook