Kalki New Release Date: మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో పాటు అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ నాగశ్విన్కి ఈ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఎవరే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ దర్శకుడు.. తన రెండో సినిమా మహానటితోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ప్రస్తుతం తెలుగు సినిమా చరిత్రలోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా గా రాబోతున్న ప్రభాస్ కల్కి 2898AD సినిమాకి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రాన్ని కూడా మహానటి చిత్రాన్ని నిర్మించిన..నాగ అశ్విన్ సొంత ఇంటి వారైనా..వైజయంతి మూవీస్ నిర్మించడం విశేషం. కాగా వైజయంతి మూవీస్ వారికి మే 9వ తేదీ ఎంతో సెంటిమెంట్ డేట్. ఆ రోజున విడుదలైన వైజయంతి మూవీ సినిమాలు అన్నీ కూడా సంచలన విజయం నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి సినిమాలు కూడా మే 9న విడుదలై మంచి విజయం అందుకున్నాయి. ఈ క్రమంలో రాబోతున్న కల్కి సినిమాని కూడా వైజయంతి మూవీస్ మే 9న విడుదల చేయాలి అని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కూడా అదే టైంలో ఉండడంతో ఇప్పుడు తప్పకుండా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తోంది. కానీ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అసలు నిజంగానే ఈ సినిమాని వైజయంతి మూవీస్ మే 9వ తేదీ నుంచి పోస్ట్ పోన్ చేస్తుందా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి.


ఈ క్రమంలో ఈ చిత్ర విడుదల తేదీ పై పక్కా క్లారిటీ వచ్చినట్టు వినికిడి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అశ్వినీ దత్ ఈ సినిమాని జూన్ 12వ తేదీన విడుదల చేయాలి అని భావిస్తున్నారట. ఇక ఇదే విషయాన్ని శ్రీరామనవమి సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేసి మరి సినిమా యూనిట్ ప్రకటించే ఉద్దేశంలో ఉన్నారు అని కూడా తెలుస్తోంది. మరి నిజంగానే ఈ గుడ్ న్యూస్ వైజయంతి మూవీ శ్రీరామనవమి రోజున ప్రకటిస్తారో లేదో తెలియాలి అంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.


Also Read: Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్‌? లేదా స్టంట్‌.. ఘటనపై అనుమానాలు ఇవే..


Also Read: KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్‌.. హెలికాప్టర్‌ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది



 


 


 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter