Uppena movie collections: ఉప్పెన. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. ఊహించనట్టే అంచనాల్ని దాటుతోంది సినిమా. పేరుకు తగ్గట్టే కలెక్షన్లు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయిట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీ కళ్లు..నీలి సముద్రం పాట( Nee kallu neeli samudram song )రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ నీలి సముద్రపు ఉప్పెన..నిజంగా ఉప్పెనగా మారినట్టుంది. ఊహించినట్టే సినిమా అంచనాల్ని దాటేస్తుందని తెలుస్తోంది. తొలి సినిమాతోనే బంపర్ హిట్ టాక్ మూటగట్టుకోవడంతో మెగాస్టార్ కుటుంబం ఆనందంగా ఉంది. అటు హీరో వైష్ణవ్ తేజ్( Vaishnav tej ) కెరీర్‌కు ఢోకా ఉండదని అంచనా వేస్తున్నారు. వాలంటైన్స్ డే కానుకగా రెండ్రోజుల ముందే విడుదలైన ఉప్పెన...పేరుకు తగ్గట్టే కలెక్షన్ల ఉప్పెన ( Uppena movie ) కురిపిస్తోంది. ప్రేమికుల్ని ఆకట్టుకునే సన్నివేశాలతో పాటు మాస్‌ని ఆకర్షించే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. తొలిరోజే ఉప్పెన పది కోట్ల కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.


సినిమా విడుదలైన తొలిరోజు నైజాం, తెలంగాణతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 10.42 కోట్లు వసూలు చేసింది. ఒక్క ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోనే 9.3 కోట్లు వసూలైంది. గతంలో ఏ హీరో సినిమాకు కూడా తొలిరోజు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాలేదని తెలుస్తోంది. ఉప్పెన సినిమా థియేటర్ రైట్స్‌ను 20.50 కోట్లకు విక్రయించగా..నైజాం ప్రాంతానికి 6 కోట్లకు, ఆంధ్ర ప్రాంతానికి 10 కోట్లకు, సీడెడ్ ప్రాంతానికి 3 కోట్లకు అమ్ముడుపోయింది. తొలిరోజే అందులో సగం డబ్బు వచ్చి పడింది.


Also read: Shankar, Ram Charan, Dil Raju: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ !


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook