Urfi Javed Leaves in Back Side ఉర్ఫీ జావెద్ బట్టలు చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఉర్ఫీ వేసుకునే బట్టలు, వెరైటీ డిజైన్లు చూస్తే ఇవెక్కడి డ్రెస్సులురా బాబు.. వాటిని డ్రెస్సులని అంటారా? అని అనుమానపడతారు. అలాంటి దుస్తులను వేసుకుని సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమె తన ప్రైవేట్ పార్టులు కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. మిగిలిన అన్ని భాగాలను ప్రదర్శించేలా డ్రెస్సులు వేసుకుంటూ ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడూ పొట్టి బట్టలు, రెండు ముక్కల డ్రెస్సులు మాత్రమే ధరించే ఉర్ఫీ తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె షేర్ చేసిన వీడియోను చూస్తే షాక్ అవుతారు. ఆమె వీడియోను ప్రారంభంలో చూస్తే ఒకలా.. ఎండింగ్‌లో చూస్తే ఇంకోలా అనుకుంటారు. ఉర్ఫీ ఇలాంటి నిండుగా ఉన్న బట్టలను వేసుకుందేంటి.. మారిపోయిందా? అని అంతా భ్రమ పడతారు. కానీ ఆ వెంటనే తమ ఆలోచన తప్పని తెలుసుకుంటారు.


 



వెంటనే వెనుకాల నుంచి ఓ ఫోటో కనిపిస్తుంది. ఆ మిర్రర్లో ఉర్ఫీ అసలు రంగు బయటపడుతుంది. ముందు నిండుగా ఉన్న బట్టలు ధరించింది. కానీ వెనకాల మొత్తంగా ఓపెన్‌గా పెట్టేసింది. దీంతో వెనకాల లో దుస్తులన్నీ కనిపిస్తుంటాయి. దీంతో ఉర్ఫీ తన పద్దతి మార్చుకోలేదని అందరికీ అర్థమవుతుంది. క్షణాల్లోనే ఉర్ఫీ అందరినీ ఆశ్చర్యపరిచి అవాక్కయ్యేలా చేస్తుంది.


ఇలా ఉర్ఫీ అందరినీ ఆశ్చర్యపర్చడం కొత్తేమీ కాదు. రకరకాల బట్టలు ధరిస్తూ అవే ట్రెండింగ్ డిజైన్లు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటుంది ఉర్ఫీ జావెద్. బిగ్ బాస్ షోతో ఈ బ్యూటీకి క్రేజ్ వచ్చింది. ఉన్నది వారమే అయినా కూడా మంచి ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. చెత్త కవర్‌లతోనూ డ్రెస్సును తయారుచేసుకునే ఆమె టాలెంట్‌ను చూసి అంతా ముచ్చటపడుతుంటారు.


Also Read:  Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?


Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి