Urvashi Rautela Defamation case ఉమైర్ సంధు అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఎంత చండాలపు ట్వీట్లు వేస్తుంటాడో అందరికీ తెలిసిందే. ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా నిజం కాలేదు. దుబాయ్ సెన్సార్ సభ్యుడు అని చెప్పుకునే ఉమైర్ సంధు ఇప్పుడు పక్క దారి పట్టాడు. సెన్సార్ సభ్యుడు రివ్యూ ఇవ్వడమే చెత్త పని అనుకుంటే.. ఇప్పుడు సెలెబ్రిటీల మధ్య అక్రమ సంబంధాలు అంటూ పిచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్నాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నాడు. దారుణమైన ట్వీట్లు పెడుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్, కరణ్‌, సల్మాన్, షారుఖ్ ఇలా ఏ ఒక్కరినీ వదిలి పెట్టడం లేదు. హీరో హీరోయిన్లకు లింకులు పెడుతున్నాడు. ఇలానే అఖిల్‌ అక్కినేని, ఊర్వశీ రౌతేలా మధ్య ఓ లింక్ పెట్టి ట్వీట్ వేశాడు. యూరోప్‌లో షూటింగ్ జరిగినప్పుడు ఊర్వశీని అఖిల్ వేధించాడట. తన తెలిసీ తెలియనితనం, ఎదిగీ ఎదగనితనంతో ఆమెను వేధించాడంటూ ట్వీట్ వేశాడు.


దీనిపై ఊర్వశీ స్పందించింది. నా లీగల్ టీం నుంచి అతనికి పరువునష్టం దావా కేసును వేస్తున్నాను.. నోటీసులు పంపిస్తున్నాను.. నీ లాంటి జర్నలిస్టులు వేసే పిచ్చి ట్వీట్లు, పోస్ట్‌లతో గౌరవం పోతోంది.. మీరేమీ నా అధికార ప్రతినిధి కాదు.. నేను నా ఫ్యామిలీ బాధపడేట్టుగా ట్వీట్లు వేసిన నువ్వే ఎదిగీ ఎదగని మనిషివి.. అంటూ ఊర్వశీ మండి పడింది. ఉమైర్ సంధు మీద కేసు వేసినట్టుగా చెప్పేసింది.


Also Read:  Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక


ఉమైర్ సంధు ఈ మధ్య హద్దులు దాటుతున్నాడని అందరూ అంటున్నారు. నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. సెలెబ్రిటీల మీద ఇంతలా పిచ్చి ట్వీట్లు వేస్తున్నా కూడా ఏ ఒక్కరూ స్పందించకపోవడం ఏంటని? అంతా అనుకుంటున్నారు. చివరకు ఊర్వశీ నడుంబిగించి ఇలా ముందుకు రావడం, అతని మీద కేసు వేయడంతో చలనం మొదలైందని నెటిజన్లు అనుకుంటున్నారు. కరణ్‌ జోహర్ గే అంటూ హీరోలందరినీ వేధిస్తుంటాడని వేసిన ట్వీట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.


 



అఖిల్ ఏజెంట్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సాక్షి, అఖిల్‌ జంటగా నటించారు. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రానికి మోహన్ లాల్ పాత్ర పెద్ద ఎస్సెట్‌లా కానుంది. ఈ సినిమాను పాన్ ఇండియాలో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ హిందీలో మాత్రం కాస్త ఆలస్యంగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.


Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook