Urvashi Rautela: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా...ఇజ్రాయెల్​(Israel)లో జరగనున్న మిస్​ యూనివర్స్​ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది. భారత్​ తరఫున ఈ వేడుకకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్న అతిపిన్నవయస్కురాలు ఊర్వశి కావడం విశేషం. 2015 మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరుపున పాల్గొన్న ఈ అమ్మడు..తిరిగి అదే వేదికపైకి న్యాయనిర్ణేతగా రావడం చెప్పుకోదగ్గ విషయం. ఈ మిస్ యూనివర్స్ 70వ ఎడిషన్‌లో మన దేశం తరుపున హర్నాజ్ సంధు(Harnaaz Sandhu) ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ పోటీలు డిసెంబరు 12న ఇజ్రాయెల్ లోని ఈలాట్(Eilat) జరుగుతాయి. ఈ కార్యక్రమం 172 దేశాల్లో ప్రసారం చేయబడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kim Sharma: వైరల్ ఫొటోస్.. బాయ్‌ఫ్రెండ్‌తో గోల్డెన్‌ టెంపుల్ వెళ్లిన యువరాజ్ మాజీ ప్రేయసి!!


డిసెంబరు 12న జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఈ మద్దుగుమ్మ ఇజ్రాయెల్​కు వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆమెను ఆ దేశ మాజీ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు(Benjamin Netanyahu) తన ఇంటికి ఆహ్వానించారు. ఆమెతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా...బెంజిమిన్ కుటుంబానికి భగవద్గీత(Bhagavad Gita)ను అందించారు ఊర్వశి. అంతేకాదూ రెండు, మూడు హిందీ పదాలను కూడా నేర్పించిందట! దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది.  ప్రస్తుతం ఊర్వశి.. 'బ్లాక్​రోజ్'​ సినిమా సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook