Movies Releasing on November 4th: థియేటర్లలోకి ఏకంగా 8 సినిమాలు.. ఏమేం సినిమాలో తెలుసా?
Movies Releasing on November 4th: ఈ వారం ఏకంగా ఎనిమిది సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకటి రెండు తప్ప మిగితావన్నీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని సినిమాలే అని చెప్పాలి. ఏమేం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? అనే వివరాల్లోకి వెళితే
Urvasivo Rakshasivo to Like share and Subscribe Releasing on November 4th: పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు లేకపోవడంతో చిన్న సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. అందులో భాగంగానే నవంబర్ 4వ తేదీ అంటే ఈరోజు ఏకంగా ఎనిమిది సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. అందులో రెండు మూడు సినిమాలు తప్ప మిగతావన్నీ పెద్దగా ఊరు పేరు తెలియని సినిమాలే అయినా థియేటర్లలో విడుదల చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అల్లు శిరీష్ అను ఇమ్మానియేల్ జంటగా రాఖీ శశి దర్శకత్వంలో రూపొందిన ఊర్వశివో, రాక్షసివో సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల అవుతుంది. ఈ సినిమాకు యూఏ సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశారు.
రెండు గంటల 24 నిమిషాల పాటు ఈ సినిమా కొనసాగుతుంది. తరువాత సంతోష్ శోభన్ ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ డైరెక్షన్లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా రూపొందింది. ఈ సినిమాకి కూడా యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. రెండు గంటల 14 నిమిషాల పాటు ఈ సినిమా సాగబోతోంది. ఇక బనారస్ సినిమా కూడా ఇదే రోజు విడుదలవుతోంది. కర్ణాటక చెందిన ఒక ఎమ్మెల్యే కుమారుడు జైద్ ఖాన్ హీరోగా బెనారస్ అనే ఒక పాన్ ఇండియా మూవీ సిద్ధమైంది. నవంబర్ 4వ తేదీ విడుదలవుతున్న ఈ సినిమాకి కూడా యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. రెండు గంటల 30 నిమిషాల పాటు ఈ సినిమా సాగుతుంది. మరోపక్క తమిళ హీరో అశోక్ సెల్వన్ హీరోగా రూపొందిన ఆకాశం సినిమా కూడా ఇదే రోజు విడుదలవుతోంది.
క్లీన్ యు సర్టిఫికెట్ సాధించిన ఈ సినిమాలో శివాత్మిక హీరోయిన్గా నటించింది. రెండు గంటల 26 నిమిషాల పాటు ఈ సినిమా సాగనుంది. మరోపక్క నందు రష్మీ జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఇదే రోజున విడుదలవుతుంది. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ సాధించిన ఈ సినిమా రెండు గంటల మూడు నిమిషాల పాటు సాగనుంది. మరోపక్క దండుపాళ్యం సినిమాకు సీక్వెల్ గా రూపొందిన తగ్గేదేలే అనే సినిమా కూడా ఇదే రోజు మొదలవుతుంది.
ఈ సినిమాకి కూడా ఏ సర్టిఫికెట్ లభించింది రెండు గంటల 8 నిమిషాల పాటు ఈ సినిమా సాగనుంది. మహేష్ బాబు బావ తెలుగుదేశం పార్టీ ఎంపీ అయిన గల్లా జయదేవ్ దగ్గర బంధువైన కృష్ణ మన్యం హీరోగా నటిస్తున్న జెట్టి సినిమా కూడా ఇదే రోజు విడుదలవుతోంది. సెన్సార్లో యూ/ఎ సర్టిఫికెట్ సాధించిన ఈ సినిమా రెండు గంటల 15 నిమిషాల పాటు సాగనుంది. అలాగే సారధి అనే మరో సినిమా కూడా ఈరోజే విడుదలవుతుంది క్లీన్ యు సర్టిఫికెట్ సాధించిన ఈ సినిమా రెండు గంటల పాటు సాగనుంది. అలాగే మిస్టర్ తారక్ అనే మరో సినిమా కూడా రిలీజ్ అవుతోంది. మరి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా హిట్ టాక్ దక్కించుకుంటుందో చూడాలి మరి.
Also Read: Pawan Kalyan Murder Conspiracy: పవన్ హత్యకు కుట్ర..250 కోట్ల సుపారీ... ఆరోజే స్కెచ్చేశారు కానీ జస్ట్ లో మిస్?
Also Read: Posani Krishna Murali : విశ్వాసానికి అందలం.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ గా పోసాని నియామకం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook