Pawan Kalyan Murder Conspiracy: పవన్ హత్యకు కుట్ర..250 కోట్ల సుపారీ... ఆరోజే స్కెచ్చేశారు కానీ జస్ట్ లో మిస్?

Conspiracy to kill Pawan kalyan: పవన్ కళ్యాణ్ ను చంపేందుకు కుట్ర జరిగిందని, సుమారు 250 కోట్ల రూపాయల సుపారీ కూడా చేతులు మారింది అంటూ ఒక ఛానల్ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 4, 2022, 05:36 AM IST
Pawan Kalyan Murder Conspiracy: పవన్ హత్యకు కుట్ర..250 కోట్ల సుపారీ... ఆరోజే స్కెచ్చేశారు కానీ జస్ట్ లో మిస్?

Conspiracy to kill Pawan kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెనుక కొంత మంది అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తున్నారని ఆయనను దగ్గర నుంచి పరిశీలిస్తూ ఆయనను వెంబడిస్తున్నారంటూ ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన జారీ చేయడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత బయటకు వెళుతున్నప్పుడు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు చాలా దగ్గర నుంచి బైక్ల మీద కార్ల మీద వెంబడిస్తూ ఆయనను నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ నేపథ్యంలోనే అసలు పవన్ వెనుక పడాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ సంచలన కథనాలను ప్రసారం చేసింది. నిజానికి గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందు వచ్చి సెక్యూరిటీతో వారు గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరిగిందని అందుకోసం 250 కోట్ల రూపాయలతో సుపారీ కూడా ఇచ్చారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. 2019 ఎన్నికల ముందే ఈ కుట్రకు బీజాలు పడినట్లుగా కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి అంటూ ఒక న్యూస్ ఛానల్ కథనాన్ని ప్రసారం చేసింది.

పవన్ ను హత్య చేసేందుకు భారీగా సుపారి తీసుకున్నారని సమాచారం అందిందని సుమారు 250 కోట్ల రూపాయల డీల్ కూడా కుదుర్చుకున్నారని సదరు ఛానల్ కథనంలో పేర్కొంది. ముందుగా ఆగస్టు 19వ తేదీన కడప జిల్లా సిద్ధవటంలో హత్య చేయడానికి ప్రయత్నించారని ఆ జిల్లా సిద్ధవటంలో జరిగిన రైతు భరోసా సభలో కిరాయి హంతకులు సంచరించినట్లు కూడా నిఘా వర్గాలు తెలిపాయని కధనంలో పార్కోన్నారు. పవన్ సిద్ధవటం వెళుతుండగా కాన్వయ్ లోకి గుత్తి తెలియని వాహనం ప్రవేశించేందుకు ప్రయత్నం చేసిందని అయితే కాన్వాయ్లోని రక్షణ సిబ్బంది హెచ్చరించడంతో ఆ వాహనం తప్పుకుందని పేర్కొన్నారు.

పవన్ హత్య ప్లాన్ కి అక్కడ బ్రేక్ పడిందని ఇప్పుడు ఏకంగా పవన్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించేందుకే సిద్ధమవడం కలకలం రేపుతోందని పేర్కొంది. అంతేకాదు పవన్ ని అంతమొందించేందుకు కొన్ని వర్గాల వారు బెంగళూరు, చెన్నై నగరాల్లో పలు దఫాలు సమావేశమయ్యారని కూడా నిఘా వర్గాలు వెల్లడించినట్లు సదరు చానల్ కథనాలు ప్రసారం చేసింది. అయితే ఈ డీల్ వెనుక ఎవరున్నారు? సుపారి ఎవరు ఎవరికి ఇచ్చారు? అందుకోసం ఎవరి నుంచి ఎవరికీ డబ్బు చేతులు మారింది? అనే విషయాలను మాత్రం సదరు కథనంలో ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇక కేంద్ర నిఘా వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ కు ఇలాంటి హెచ్చరికలు జారీ చేసిన విషయం కూడా బయటికి రాలేదు మరి ఇందులో నిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Heroines Rare Medical Conditions: సమంత సహా అరుదైన వ్యాధులతో బాధ పడుతున్న హీరోయిన్లు వీరే!

Also Read: Posani Krishna Murali : విశ్వాసానికి అందలం.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ గా పోసాని నియామకం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News