UV Creations : ముక్కలైన యూవీ క్రియేషన్స్?.. ప్రభాస్‌ను వదిలేస్తోన్న సోదరులు
UV Creations Banner యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సోదరుల బ్యానర్ అని అందరికీ తెలిసిందే. వంశీ ప్రమోద్ విక్రమ్ ఇలా అంతా కలిసి ఆ బ్యానర్ వెనుక ఉండి నడిపిస్తుంటారు. ఇందులో విక్రమ్ అనే వ్యక్తికి రామ్ చరణ్‌కు మంచి సంబంధాలుంటాయని తెలిసిందే.
UV Creations Banner ప్రభాస్ సన్నిహితులు కలిసి ప్రారంభించిన యువి క్రియేషన్స్ సంస్థ ఇప్పుడు ముక్కలైపోయిందనే ప్రచారం ఊపదుకుంది. నిజానికి ప్రభాస్ సోదరుడు వరుసయ్యే ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి, రామ్ చరణ్ స్నేహితుడైన విక్రమ్ రెడ్డి కలిసి ఈ యువి క్రియేషన్స్ అనే సంస్థను 2013 వ సంవత్సరంలో ప్రారంభించారు. అప్పట్లోనే మిర్చి వంటి సినిమాతో నిర్మాణం ప్రారంభించి అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న దాదాపు అన్ని సినిమాలు దారుణమైన డిజాస్టర్ ఫలితాలను అందుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే యువి క్రియేషన్ సంస్థ ముక్కలు అయిపోయినట్లుగా ప్రచారం మొదలైంది. ఇప్పటికే యువి కాన్సెప్ట్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభం కాగా ఈ మధ్యనే రామ్ చరణ్ తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ పేరుతో మరో నిర్మాణ సంస్థ ప్రారంభించాడు. అదే నిర్మాణ సంస్థ నుంచి నిఖిల్ హీరోగా ఒక పాన్ ఇండియా సబ్జెక్టు చేస్తున్నాడు. అంటే విక్రమ్ రెడ్డి పేరులో ఉన్న మొదటి అక్షరం వి అలాగే మెగా పేరును కలిపి ఈ మెగా పిక్చర్స్ పేరుతో ఒక కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఇలా ఎవరికి వారు తమ దారి చూసుకుంటున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది.
Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?
మరో ఆసక్తికరమైన ప్రచారం మేరకు ఈ ముగ్గురు నిర్మాతల్లో ఒకరు దాసరి మారుతి, ఎస్కేయన్ కలిసి ప్రారంభించిన మాస్ మూవీ మేకర్స్ అనే నిర్మాణ సంస్థకు ఫైనాన్షియల్ సపోర్టుగా నిలబడుతున్నారని కూడా చెబుతున్నారు. ఈ సంస్థ నుంచి మీరు ముగ్గురు సంయుక్తంగా కలిసి చేస్తున్న చివరి ప్రాజెక్టుగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంస్థ చేయాల్సిన స్పిరిట్ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేతికి వెళ్ళగా రామ్ చరణ్ 16వ సినిమా వి మెగా పిక్చర్స్ చేతికి వెళ్ళింది.
Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK