Vakeel saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం భారీ అంచనాలకు తగ్గట్టుగానే హిట్‌టాక్ మూటగట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు సాధిస్తోంది. మరి యూఎస్ మార్కెట్‌లో ఎందుకు పరాజయం ఎదుర్కొంటోంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)మూవీ పింక్ ( Pink Movie) ఆధారంగా నిర్మితమైన సినిమా వకీల్ సాబ్. మహిళల పరిస్థితుల్ని సినిమాలో చక్కగా తెరకెక్కించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan kalyan) వకీల్ సాబ్( Vakeel saab) ‌గా నటించిన సినిమా భారీ అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‌లో కూడా తొలుత భారీ వసూళ్లు రాబట్టింది.కానీ తరువాత కరోనా పరిస్థితులు విజృంభించడంతో కలెక్షన్లు నిలిచిపోయాయి. మరోవైపు యూఎస్ మార్కెట్‌లో ఈ చిత్రం ఘోర పరాజయం మూటగట్టుకోవడం అటు అభిమానులకు ఇటు చిత్ర యూనిట్‌కు నిరాశను మిగిల్చింది.


వకీల్ సాబ్ చిత్రం (Vakeel saab movie) అమెరికా బాక్సాఫీసు వద్ద 1.3 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో మొదలుపెట్టి..తొలిరోజు ప్రీమియర్ల రూపంలో  3 లక్షల డాలర్లను నమోదు చేసుకుంది. అనంతరం 1 లక్షా 54 వేల డాలర్లు, రెండో రోజున 1 లక్షా 44 వేల డాలర్లు, మూడో రోజున 72 వేల డాలర్లకు తగ్గిపోతూ వచ్చింది. ఆరవ రోజున ఏకంగా 8 వేల 311 డాలర్లకు పడిపోయింది. ఏడవ రోజున మరింతగా కలెక్షన్లు పడిపోయి 6 వేల 951 డాలర్లకు చేరుకుంది. మొత్తానికి వకీల్ సాబ్ చిత్రం 5.53 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లు చూస్తే..వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీసు రన్ ముగిసేసరికి..నష్టాల్లో కూరుకుపోయే అవకాశముందని వాణిజ్యవర్గాలు పేర్కొంటున్నాయి.


Also read: Acharya movie release date: ఆచార్య సినిమా షూటింగ్ ఎందుకు నిలిచిపోయింది..విడుదల ఎప్పుడు మరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook