Vakeel Saab pre-release event news: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఎంజాయ్ చేద్దాం అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్. వకీల్​సాబ్​ మూవీ ప్రీ-రిలీజ్​ ఈవెంట్​ నిర్వహణకు హైదరాబాద్​ పోలీసులు అనుమతి నిరాకరించారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం  వకీల్​సాబ్​ మూవీ ప్రీ-రిలీజ్​ ఈవెంట్​‌కి అనుమతి ఇవ్వలేమని జూబ్లీహిల్స్​ పోలీసులు స్పష్టంచేశారు. హైదరాబాద్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంతో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బ్రేకులు పడినట్టయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 9న వకీల్ సాబ్ మూవీ రిలీజ్ కానుంది. అయితే అంతకంటే ముందుగా వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో భాగంగానే మార్చి 29న హోలీ సందర్భంగా వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత జరగాల్సి ఉన్న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటు మగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సైతం ముఖ్య అతిథులుగా హాజరు అవుతారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడిలా Vakeel Saab pre-release event కి కరోనా ఆంక్షల రూపంలో అడ్డుకట్ట ఎదురైంది. 


Also read : Pawan Kalyan: వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ మధ్య తోపులాట, పగిలిన అద్దాలు


సాధారణంగా అయితే తన సినిమాల ప్రమోషన్స్‌పై పవర్ స్టార్ ఎక్కువగా ఫోకస్ చేయరనే పేరుంది కానీ ఈసారి వకీల్ సాబ్ ప్రమోషన్స్‌ విషయంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాస్త యాక్టివ్‌గానే ఉండాలని భావిస్తున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి. 



ఇదిలావుంటే, మరోవైపు Vakeel Saab trailer కి పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచే కాకుండా అన్నివర్గాల ఆడియెన్స్ నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్‌ని సొంతం చేసుకుని తెలుగు సినిమా ట్రైలర్లలో మోస్ట్ లైక్డ్ ట్రైలర్‌గా ఓ సరికొత్త రికార్డు అందుకుంది. దీంతో Pawan Kalyan ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook