Vakeel Saab Songs: ఒక్క క్లిక్‌తో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సాంగ్స్ జూక్ బాక్స్
Vakeel Saab Songs Jukebox: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్‌కు మరో అప్‌డేట్ వచ్చేసింది. వకీల్ సాబ్ మూవీ అన్ని పాటను ఆదిత్య మ్యూజిక్ మీకు అందిస్తోంది. సంగీత దర్మకుడు ఎస్ థమన్ అందించిన స్వరాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Vakeel Saab Songs Jukebox: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. వకీల్ సాబ్ నుంచి ఇటీవల టీజర్ విడుదల కాగా 35 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. గతంలో విడుదలైన మగువా మగువా లిరికల్ సాంగ్, సత్యమేవ జయతే పాటలు ప్రజాధరణ పొందాయని తెలిసిందే. తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘కదులు కదులు కదులు కట్లు తెంచుకుని కదులు..’ సాంగ్‌ను విడుదల చేయాలని భావించింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్’ మూవీ ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా థిటయేర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ మూవీని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ సమర్పణలో టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. నేడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్‌కు మరో అప్‌డేట్ వచ్చేసింది. వకీల్ సాబ్ మూవీ అన్ని పాటను ఆదిత్య మ్యూజిక్ మీకు అందిస్తోంది. సంగీత దర్మకుడు ఎస్ థమన్ అందించిన స్వరాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Also Read: Republic Teaser: సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ టీజర్ విడుదల, పవర్ ఫుల్ కాన్సెప్ట్
‘కదులు కదులు కదులు కట్లు తెంచుకుని కదులు..’ సాంగ్ ప్రత్యేకంగా విడుదల చేయకుండా జూక్ బాక్స్ ద్వారా తీసుకొచ్చారు. వేసవిలో విడుదల కానున్న సినిమాలకు వకీల్ సాబ్ గట్టి పోటీ ఇవ్వనుందని సీని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదివరకే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లో తీసిన పింక్ సినిమాకు తెలుగు రీమేక్‌గా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులుచేర్పులతో వస్తోంది ఈ వకీల్ సాబ్. హిందీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషించారు.
Also Read: Nagarjuna Latest Look: టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని వైల్డ్ డాగ్ లుక్ స్టిల్స్ వైరల్
న్యాయం కోసం పలువురు అమ్మాయిలు సాగించే న్యాయ పోరాటంలో వారికి బాసటగా నిలిచే లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. ఆయనకి జంటగా గబ్బర్ సింగ్ తరువాత శ్రుతి హాసన్ (Shruti Haasan) మరోసారి నటిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి, అనన్య నాగళ్ల, నివేదా థామస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook