Vakeel Saab trailer: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్
Vakeel Saab trailer release date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ మూవీ విడుదల కానుండగా మార్చి 29న వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ వెల్లడించింది.
Vakeel Saab trailer release date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ మూవీ విడుదల కానుండగా మార్చి 29న వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ వెల్లడించింది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాలీవుడ్‌లో తెరకెక్కిన పింక్ సినిమాకు తెలుగు రీమేక్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
అయితే, తాజాగా వేణు శ్రీరామ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'Pink movie ఎలా ఉందో అచ్చం అలాగే ఈ సినిమాను తెరకెక్కించలేదని, దీనిని పవన్ కల్యాణ్ స్టైల్లో ఆయన్ను ఫుల్‌లెంగ్త్ పాత్రలో చూపిస్తూ వకీల్ సాబ్ మూవీని తెరకెక్కించాం' అని చెప్పుకొచ్చాడు. అంటే.. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందన్నమాట.
Also read : Hari Hara Veeramallu first look: హరి హర వీరమల్లు ఫస్ట్ లుక్ వీడియో వైరల్
వకీల్ సాబ్ సహాయం కోరి వచ్చే ముగ్గురు యువతుల పాత్రల్లో అంజలి, అనన్య నాగళ్ల, నివేదా థామస్ కనిపించనున్నారు. వకీల్ సాబ్ Pawan Kalyan కి శృతి హాసన్ జంటగా నటించింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook