Valentine’s Day Special: 'అఖండ'తో థియేటర్ల దద్దరిల్లేలా చేసిన బాలయ్య (Balakrishna)...టాక్​ షోతో ఓటీటీలో దుమ్మురేపుతున్నారు. సినిమాల ద్వారా తనలోని కొన్ని యాంగిల్స్ మాత్రమే చూపించిన బాలయ్య.. 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే'తో (Unstoppable with NBK) తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసి... ఫ్యాన్స్​ను అలరిస్తున్నారు. కామెడీ చేస్తూ, పంచ్​లు వేస్తూ హోస్ట్​ గా ఇరగదీస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆహా (AHA) ఓటీటీ వేదికగా ప్రారంభమైన ఈ షో..అనతి కాలంలోనే ప్రేక్షకుల మన్ననలను పొందింది. బాలయ్య షోలో పలువురు స్టార్ నటులు సందడి చేశారు. మెహన్ బాబు, రాజమౌళి, అల్లుఅర్జున్, రష్మిక మందన్నా, రవితేజ, బ్రహ్మనందం, అనిల్ రావిపూడి, నాని, మహేష్ బాబు వంటి నటులు ఈ షోకు విచ్చేశారు. ఈ షో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది.


తాజాగా ఈ కార్యక్రమంలో నేడు వాలంటైన్స్​ డే (Valentine’s Day) సందర్భంగా అమ్మాయిలను ఎలా ఇంప్రెస్ చేయాలో కొన్ని చిట్కాలు చెప్పారు బాలయ్య. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ముఖ్యంగా మూడు టిప్స్ చెప్పారు బాలయ్య. 


1. అన్​స్టాపబుల్​ 'పుష్ప' స్పెషల్​ ఎపిసోడ్​ చూడండి. అందులో స్పెషల్​ గెస్ట్​గా రష్మిక వచ్చింది. 
2. అమ్మాయిలకు అర్ధంకాని భాషలో అందంగా పొగడండి.
3. అమ్మాయిలు ఏం చేసినా ఇబ్బంది పెట్టి..హార్ట్ చేయకండి. 




Also Read: Korean Girl Srivalli Dance: అల్లు అర్జున్ ను కాపీ కొట్టిన కొరియన్ బ్యూటీ- శ్రీవల్లీ డ్యాన్స్ వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook