Ramam Raghavam Glimpse


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జబర్దస్త్ తో మనకెంతో చేరువైన ధనరాజ్ ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి కూడా మనల్ని మెప్పించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నటుడు దర్శకుడిగా మారి మన ముందుకి రావడం రామం రాఘవం అనే సినిమాతో రాబోతున్నాడు


స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో   తెరకెక్కుతున్న ఈ సినిమా సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా రానున్న ఈ సినిమాలో ధనరాజ్ కొడుకుగా నటించగా సముద్రఖని తండ్రిగా నటించబోతున్నారని వినికిడి.


కాగా ప్రేమికుల రోజు సందర్భంగా రామం రాఘవం చిత్ర గ్లిమ్స్ ను హీరో ఉస్తాద్ రామ్ పోతినేని తన ట్విట్టర్ ఖాతాలో డిజిటల్ గ్లిమ్స్ విడుదల చేసి చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.


 



అలాగే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మీడియా గ్లిమ్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ క్లిప్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. అనంతరం  ఈ సినిమా గురించి హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘... ధనరాజ్ నటుడిగా బిజీగా ఉన్నా.. ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని కరెక్కించారు. గ్లిమ్ చాలా ఆసక్తికరంగా ఉంది, ఎమోషనల్ జర్నీ తో రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమికుల రోజును తండ్రి కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ ను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన గ్లిమ్స్ విడుదల చెయ్యడం కొత్తగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. 


 



ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు,సత్య, పృద్వి,  శ్రీనివాసరెడ్డి, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, ఇక ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు హైదరాబాద్,  అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న. ఈ ఎమోషనల్ చిత్రం తమిళ తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.


Also Read: Chalo Nalgonda: నల్లగొండ సభలో గర్జించిన కేసీఆర్‌.. తెలంగాణ కోసం పులిలా కొట్లాడుతానని వ్యాఖ్యలు


Also Read: Chalo Nalgonda: రెచ్చిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. కేటీఆర్‌, హరీశ్ రావు బస్సుపై కోడిగుడ్లతో దాడి



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి