Vanitha Vijay Kumar : ఆయన నా భర్త కాదు.. చనిపోయినందుకు బాధ లేదు.. వనిత విజయ్ కుమార్ కామెంట్స్
Vanitha Vijay Kumar 3rd Husband వనిత విజయ్ కుమార్ కరోనా టైంలో ఎంతగా రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. కరోనా కంటే కాస్త ముందు ఈమె మూడో పెళ్లి వ్యవహారం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి చెల్లదంటూ పీటర్ పాల్ భార్య ఎలిజబెత్ రోడ్డు మీదకు ఎక్కిన సంగతి తెలిసిందే.
Vanitha Vijay Kumar 3rd Husband వనిత విజయ్ కుమార్, పీటర్ పాల్ సంగతి అందరికీ తెలిసిందే. సడెన్‌గా లిప్ లాక్‌లు పెట్టుకుని కనిపించారు. క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి చేసుకున్నట్టుగా దర్శనం ఇచ్చారు. ఇక ఈ విషయం అయితే పీటర్ పాల్ భార్య ఎలిజబెత్‌కు తెలియదట. ఏదో సినిమా షూటింగ్ అని చెప్పారని, నిజం పెళ్లి అని అనుకోలేదంటూ తరువాత వాపోయింది ఎలిజబెత్. ఇక తాను విడాకులు ఇవ్వకుండా పీటర్ ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాడు అని ఎలిజబెత్ కేసు వేసింది.
వనిత మూడో పెళ్లి మీద కోలీవుడ్‌లో ఎన్ని రకాల డిబేట్‌లు, ట్రోలింగ్‌లు, అరెస్టులు జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ మ్యాటర్‌లోకి కస్తూరీ శంకర్ కూడా వచ్చింది. అయితే గోవాకి వనిత, పీటర్, వనిత పిల్లలు అంతా వెళ్లారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ పీటర్ చర్యలు, నిత్యం తాగుతూ ఉండటం, డబ్బుల కోసం వేధిస్తుండటంతో గోవా వెకేషన్ నుంచి వెంటనే తిరిగి వచ్చారు. ఆ తరువాత పీటర్‌ను దగ్గరికి కూడా రానివ్వలేదు వనిత. అయితే తాను సింగిల్‌గా ఉంటూ సందడి చేస్తూ వచ్చింది.
అయితే ఇప్పుడు పీటర్ పాల్ అనారోగ్య కారణాలతో మరణించాడు. దీంతో వనిత మూడో భర్త మరణించాడు అంటూ వార్తలు రాశారు. ఆ వార్తలపై ఇప్పుడు వనిత స్పందించింది. అసలు తనకు లీగల్‌గా పెళ్లి కాలేదు అని, పీటర్ తన భర్త కాదు అని, కానీ మీడియా మాత్రం అలా నా భర్త చనిపోయాడని, నేను బాధపడుతున్నాను అని వార్తలు రాస్తోంది. కానీ నేనేమీ బాధపడటం లేదు.. సంతోషంగా ఉన్నాను అని వనిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read: Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి
వనిత విజయ్ కుమార్ ఇప్పుడు పేల్చిన బాంబ్‌తో అంతా షాక్ అవుతున్నారు. అసలు పెళ్లే కాలేదని, పీటర్ ఎవరో అన్నట్టుగా ట్వీట్ వేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇలా తన భర్త పోయాడంటూ వార్తలు రాస్తుండటంపై చూసి చూసి విసిగి చెంది స్పందించానని చెప్పుకొచ్చింది వనిత.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook