Vanitha Vijayakumar: తండ్రి మాటల వల్ల జీవితం నాశనం అయ్యింది.. సీనియర్ నటుడు కూతురి సెన్సేషనల్ వ్యాఖ్యలు
Vanitha: దేవి సినిమాలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి వనిత విజయ్ కుమార్. ఈ మధ్య నరేష్ హీరోగా చేసిన మళ్లీ పెళ్లి సినిమాలో కూడా కనిపించింది. కాగా ఈనటి ఆమె తండ్రి విజయ్ కుమార్ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Vijayakumar Daughter: నటుడు విజయ్ కుమార్ ఆయన భార్య మంజుల మన అందరికీ సుపరిచితులే. ఇద్దరూ కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా వీరి పిల్లలు కూడా సినిమాలలో నటించి మెప్పించారు. రుక్మిణి సినిమాతో వీరిద్దరి రెండో కూతురు రుక్మిణి మనకు పరిచయమై అలరించింది. ఆ తరువాత క్షేమంగా వెళ్లి లాభంగా రండి.. వైఫ్ లాంటి సినిమాలలో కనిపించింది ఈ హీరోయిన్. కాగా వీరిద్దరి మరో కుమార్తె శ్రీదేవి నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ లాంటి సినిమాలలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
వీరిద్దరూ మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ మరో కుమార్తె వనిత విజయ్ కుమార్ మాత్రం తన సినిమాల కన్నా ఎక్కువ వివాదాల వల్ల వార్తల్లో నిలుస్తూ వచ్చింది. దేవీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలు అయిన హీరోయిన్ వనిత విజయ్ కుమార్. అయితే ఈ నటికి ఆ తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో మాత్రం అడపదడప సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంది.
ఈమధ్య తమిళ బిగ్ బాస్ లో ఎన్నో వివాదాలలో పాల్గొని మరింత చేరువైంది. అయితే ఈమె వివాదాల వల్లే ఎక్కువగా పేరు తెచ్చుకుంటూ ఉంటుంది అనేది పెట్టింది పేరు. ఈ మధ్య వచ్చిన కాంట్రవర్షియల్ చిత్రం నరేష్ మళ్లీ పెళ్లిలో సైతం కనిపించింది వనిత విజయ్ కుమార్.
ఈమె వివాదాల వల్లో ఏమో తెలియదు కానీ ముందు నుంచి విజయ్ కుమార్ ఫ్యామిలీ తనను దూరంగా పెడుతూ వస్తారు అనే వార్త ప్రచారంలో ఉంది. రీసెంట్‌గా వనిత మరోసారి తన ఫ్యామిలీ తనని పట్టించుకోని విషయాన్ని బయట పెట్టింది. దీనిపై వనిత ఇన్‌స్టా స్టోరీలో స్పందించారు.
రీసెంట్‌గా విజయ్‌కుమార్ మనవరాలు దియా వివాహం దిల్లాన్ మిస్త్రీతో గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహ వేడుకలో విజయ్‌కుమార్ ఇద్దరు భార్యల పిల్లలు సందడి చేశారు. కానీ పెద్ద కుమార్తె వనితకు ఆహ్వానం అందలేదు. దియా వివాహానికి ఆహ్వానం అందకపోవడంపై వనిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక చోట గుమిగూడిన గుంపు మధ్య సింహం ఒంటరిగా నడుస్తున్నట్లు వీడియోను పోస్ట్ చేసారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంటర్వ్యూ కూడా ఒకటి తెగ వైరల్ అవుతుంది.
ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘విజయ్‌కుమార్ పిల్లలు అందరి పేర్లు చెప్పి నా పేరు మాత్రం చెప్పలేదని .. ఆయన చెప్పకపోయినా ఈ ప్రపంచానికి నేను ఆయన కూతురు అనే విషయం తెలుసు. నా తండ్రి మాటలు వినడం వల్లే నా జీవితం నాశనం అయింది’ అంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి ఈ పోస్ట్ అలానే వనిత విజయ్ కుమార్ ఇంటర్వ్యూ వల్ల మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది.
Also Read: Mallu Ravi: తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం.. సంచలనం సృష్టించిన మల్లు రవి రాజీనామా
Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్, రుణమాఫీ ఎప్పటినుంచంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి