Varaha Roopam Video Song: గతేడాది చిన్న సినిమాగా వచ్చిన కాంతార ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నీ తిరగరాసింది. కన్నడలో కేజీఎఫ్ తర్వాత రికార్డు స్థాయి కలెక్షన్స్ ను సాధించిన సినిమాగా కాంతార నిలిచింది.. రిషబ్ శెట్టి స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది భారీ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది. కాంతార రిలీజై నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా కాంతారను నిర్మించిన హొంబాలే ఫిల్మ్స్ ఓ సర్‌ప్రైజ్‍ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలోని ‘వరాహ రూపం’ సాంగ్ పుల్ వీడియోను విడుదల చేసింది. ఈ పాటను కన్నడ భాషలో మాత్రమే రిలీజ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరాహ రూపం’ సాంగ్‍లో రిషబ్ శెట్టి ఆడిన భూతకోల నృత్యం ఓ రేంజ్ లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అజనీశ్ లోకనాథ్ సంగీతం అందించారు. వరాహ రూపం పాటను సాయి విఘ్నేశ్ అలపించగా..శశి రాజ్ కావూర్ లిరిక్స్ అందించారు. ‘వరాహ రూపం’ పాటపై వివాదం చెలరేగి కోర్టు వరకు కూడా వెళ్లింది. అయితే, చివరికి హొంబాలే ఫిల్మ్స్‌కు అనుకూలంగా తీర్పువచ్చింది. కాంతార చిత్రంలో రిషబ్ శెట్టికి జోడిగా సప్తమి గౌడ హీరోయిన్‍గా నటించారు. కేవలం రూ.20కోట్లలోపు బడ్జెట్‍తో తెరకెక్కిన కాంతార సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కాంతారకు ప్రీక్వెల్‍గా కాంతార 2 తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. 



Also Read: Baby Success: బేబీ డైరెక్టర్ కు కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌.. ధర ఎంతంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook