Varalaxmi: ఇక చాలు ఆపండి.. అవి చదివితే నాకు కోపం వస్తోంది.. వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్
Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా నెగిటివ్ పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయింది ఈ నటి. తాజాగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Varalaxmi Sarathkumar Controversy: సినిమా రివ్యూల గురించి సినిమా సెలబ్రిటీస్ ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. కొంతమంది రివ్యూల వల్లే తమ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని రివ్యూల పైనే మొత్తం తప్పు వేసేస్తూ ఉంటారు. సినిమా బాగున్నప్పుడు ఇలాంటి తప్పులు రివ్యూల పైన వేయడం కరెక్టే కానీ సినిమాలు బాగా లేకపోయినా రివ్యూలదే తప్పు అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఇది రోజు నడుస్తున్న చర్చే. ఈ క్రమంలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ సైతం రివ్యూల పై మండిపడింది.
తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తన పాత్ర ప్రాధాన్యత ఉందే శబరి అనే చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వరలక్ష్మీ శరత్ కుమార్ రివ్యూల గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..“నేను అసలు సినిమాలకు మొదటి రోజు వచ్చే రివ్యూలు చదవను. ఒకవేళ నా దగ్గర ఎవరైనా వాటి గురించి మాట్లాడినా నాకు చాలా కోపం వస్తుంది. అసలు ఈ రివ్యూలు రాసే వారికీ ఏం అర్హత ఉందని ఇలా సినిమాల గురించి రివ్యూలు రాసుకొస్తున్నారు. బాగున్నా సినిమాకి కూడా తమ వ్యూలు కోసం నెగటివ్ రివ్యూలు రాసి ఆ సినిమాలను కాస్త నాశనం చేస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కనీసం ఒక ఐదు రోజులు అయినా రివ్యూలు ఇవ్వడం ఆపండి.. సినిమాలకు మంచి జరుగుతుంది” అంటూ రివ్యూ లపై మందిపడింది ఈ హీరోయిన్.
ఇక ‘శబరి’ సినిమా విషయానికి వస్తే.. మదర్ సెంటిమెంట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త డైరెక్టర్ అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతుంది. మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా మే 3న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది.
Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter