Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..

Smita Sabharwal:  సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు. ప్రతిరోజు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తన దైన స్టైల్ లో సామాజిక మాధ్యమంలో స్పందిస్తుంటారు. తాజాగా, ఈరోజు వరల్డ్ బుక్ డే నేపథ్యంలో ఆమె చేసిన ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Apr 23, 2024, 14:32 PM IST
1 /7

తెలంగాణ డైనమిక్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఆమె బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ సెక్రెటరీగా గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. మిషన్ భగీరథ అంత ఎక్కువగా సక్సెస్ కావడానికి వెనుక.. స్మితాసబర్వాల్ పాత్ర ఉందని చెబుతుంటారు.

2 /7

ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరుపుతూ.. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులులేకుండా చూసుకునే వారు. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ పేషీలో స్మితా ఒక ప్రముఖ పాత్రను పోషించారని చెబుతుంటారు. కానీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు కీలక శాఖల నుంచి తప్పించి,ఇతర శాఖలకు బదిలీ చేశారు.  

3 /7

కరీంనగర్ కు కలెక్టర్ గా ఉన్నప్పుడు స్మిత సబర్వాల్ కొందరు మహిళలు ఇబ్బందికర పరిస్థితులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. తనకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కూడా ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడమే తమ కర్తవ్యమని ఆమె చెబుతుంటారు.

4 /7

ముఖ్యంగా స్మితా సబర్వాల్ కు సోషల్ మీడియాలో మిలియన్లలో ఫాలోయింగ్ ఉంది. ఆమెను ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు. చిన్నతనంలో అత్యంత పిన్న వయస్కులో ఐఏఎస్ సాధించిన యువతిగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా అనేక ప్రభుత్వాలలో కీలక పాత్ర పోషించి తన మార్కు చూపించింది.

5 /7

ఇటీవల మరో ఐఏఎస్ అధికారిణి పమేలా సత్పతి కుమారుడు, ఆఫీస్ లో అల్లరి చేయడం, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిపై కూడా స్మితా సబర్వాల్ స్పందించారు. ఒక తల్లికి ఇటు తన కర్తవ్యంతో పాటు, ఆఫీసు వర్కు రెండు కూడా సమపాళ్లలో చూసుకొవడం కత్తిమీద సామని అన్నారు. ఆ పిల్లాడు సూపర్ కిడ్ అని తన చిన్నతనం గుర్తుకు వచ్చిందంటూ కూడా కామెంట్లు చేశారు.

6 /7

ఇదిలా ఉండగా స్మితా సబర్వాల్ ఈరోజు ఏప్రిల్ 23 వరల్డ్ బుక్ డే సందర్బంగా ఒక ట్విట్ చేశారు. పుస్తకాల ప్రాముఖ్యత గురించి తెలిపారు. పుస్తకాలు చదవడం వల్ల మనలోని చీకటి అజ్ఞానం దూరమైపోతుందన్నారు.  అంతేకాకుండా..పుస్తకాలు మంచి మిత్రుల లాంటివని కూడా ఆమె అన్నారు. నిరంతరం పుస్తక పఠనం అలవాటు చేసుకొవాలన్నారు.

7 /7

చిరిగిన చొక్కా అయిన తొడుక్కొ.. ఒక మంచి పుస్తకం కొనుక్కొ అన్న కందుకూరీ వీరేశలింగం స్పూర్తితో.. పుస్తక పఠనంచేయాలని అధికారిణి సూచించారు. పుస్తక పఠనం వల్ల వ్యక్తిత్వ వికాసంలో మంచి మార్పువస్తుందన్నారు. ప్రతి ఒక్కరు డైలీ కనీసం ఒక పేజీ అయిన పుస్తకం చదవాలంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x